Site icon HashtagU Telugu

Coconut Milk : పొడవాటి జుట్టు కావాలంటే కొబ్బరి పాలలో ఆ రెండు కలిపి రాయాల్సిందే?

If You Want Long Hair, Do You Have To Mix The Two In Coconut Milk..

If You Want Long Hair, Do You Have To Mix The Two In Coconut Milk..

మామూలుగా స్త్రీలు ప్రతి ఒక్కరూ కూడా పొడవాటి జుట్టు కావాలని కోరుకుంటున్నారు. అందుకోసం రకరకాల షాంపూలు బ్యూటీ ప్రోడక్ట్లను ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో చాలామంది హెయిర్ ఫాల్ అలాగే జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా జుట్టు రాలిపోవడం,చిన్న జుట్టు లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే మహిళలు కోరుకున్న విధంగా పొడవాటి జుట్టు కావాలంటే ఏం చేయాలి?  కొబ్బరి పాలు (Coconut Milk) కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. అందుకోసం ఎటువంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

ముఖ్యంగా చర్మం ఆరోగ్యానికి జుట్టు ఆరోగ్యానికి కొబ్బరి పాలు (Coconut Milk) ఎంతో బాగా ఉపయోగపడతాయి. మరి కొబ్బరిపాలను అందానికి ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చర్మాన్ని శుభ్రం చేయడం కోసం రెండు టీ స్పూన్ల చక్కటి కొబ్బరి పాలను (Coconut Milk) తీసుకొని అందులో ఒక శుభ్రమైన బట్టను తీసుకొని ఆ పాలల్లో ముంచి ముఖానికి రాయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న జిడ్డు మురికి తొలగిపోతుంది. అలాగే కొబ్బరిపాలు, తేనె, గుడ్డు మూడింటిని కలిపి ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల చర్మం తేమగా, మృదువుగా తయారవుతుంది.
అలాగే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడేందుకు, పొడవాటి జుట్టు కోసం కొబ్బరి పాలు, గుడ్డు, పెరుగు కలిపి హెయిర్ మాస్క్ తయారు చేయడం వల్ల జుట్టుకి సరైన పోషణ అందుతుంది.

అలా తేమగా కూడా ఉంటుంది. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల జుట్టుకు సంబంధించిన సమస్యలు దరిచేరవు . జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సాయపడుతుంది. కొబ్బరిపాలలో జుట్టుకి అవసరమైన పోషకాలు ఉంటాయి. కాబట్టి, ఇది జుట్టు నిగనిగలాడేందుకు, దృఢంగా మార్చడంలో, జుట్టును పెంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా చలికాలంలో కొబ్బరిపాలు ఎంతో బాగా ఉపయోగపడతాయి. చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం తేమని కోల్పోకుండా ఉంటుంది. దాంతో పగుళ్ళ లాంటి సమస్యలు కూడా రావు.

Also Read:  Winter : చలికాలంలో మనం తినకూడని ఆహార పదార్థాలు ఇవే..