Heart : ఈ సంకేతాలు కనిపిస్తే మీ గుండె గండంలో ఉన్నట్టు..అవేంటో తెలుసుకోండి

ఈతరం వారి జీవనశైలి (Lifestyle) గాడి తప్పింది. ఆహారపు అలవాట్లు సరిగ్గా లేవు. దీనివల్ల గత కొన్నేళ్లుగా..

మీరు మెట్లు ఎక్కేటప్పుడు అసౌకర్యంగా ఉంటుందా? అర్ధరాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుందా? కాళ్ళలో వాపు, మూర్ఛ వంటివి వస్తున్నాయా? అయితే అవి మీ గుండెకు (Heart) మంచి సంకేతం కాదు. మీ గుండె ఒకవేళ ముప్పులో ఉంటే తెలియజేసే కొన్ని సంకేతాలు, లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఇవి కనిపించిన వెంటనే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని మర్చిపోకండి.

ఈతరం వారి జీవనశైలి గాడి తప్పింది. ఆహారపు అలవాట్లు సరిగ్గా లేవు. దీనివల్ల గత కొన్నేళ్లుగా.. 40 ఏళ్లలోపు వారికి కూడా గుండెపోటు ముప్పు పెరిగింది. జన్యు పరమైన కారణాల వల్ల కూడా ఈ రిస్క్ కలుగుతుంటుంది. జీవనశైలి, ఆహారం తీసుకోవడంలో మార్పులు చేసుకోవడం ద్వారా గుండె (Heart) సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి కారణంగా గుండెపోటు ప్రమాదం పెరిగింది.  నేటి కాలంలో ప్రజలు మునుపటి కంటే చాలా తక్కువ చురుకుగా ఉంటున్నారు. ఆరోగ్యకరమైన గుండె కోసం.. మరింత ఎక్కువగా నడవడం, మెట్లు ఎక్కడం అవసరం.  సమయానికి నిద్రపోవడం మరియు ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం కూడా కీలకమే.  పొగాకు, ఆల్కహాల్ వాడకాన్ని కూడా నివారించాలి.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది:

ఏదైనా శారీరక శ్రమ చేస్తున్నప్పుడు శ్వాస ఆడకపోవటంతో పాటు ఛాతీ నొప్పి సమస్యను ఎదుర్కోవలసి వస్తే.. అది మీ గుండె ఆరోగ్యంగా లేదని చెప్పే సంకేతం.

అర్ధరాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది:

రాత్రి అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వల్ల నిద్రలేచినట్లయితే, అది గుండె సంబంధిత వ్యాధులను సూచిస్తుంది.

కాళ్ళలో వాపు, మెట్లు ఎక్కేటప్పుడు ఇబ్బంది:

మీరు మెట్లు ఎక్కేటప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఫీలైనా కొంత అనుమానించాలి. మీ కాళ్ళలో వాపు ఉంటే..అది మీ గుండె కండరాలు చాలా బలహీనంగా మారాయనే దానికి సంకేతం.

కుటుంబ చరిత్ర:

మీ ఇంట్లో ఎవరికైనా ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నా.. చెడు కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నా.. అవి మీకు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది.

ఛాతీ నొప్పి:

మీకు అకస్మాత్తుగా తీవ్రమైన ఛాతీ నొప్పి, ఛాతీ మధ్యలో భారం, మంట, అసౌకర్యం ఉంటే అది కూడా ప్రమాద సంకేతమే.  అటువంటి పరిస్థితిలో.. మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

అలసట:

మీకు చాలా అలసట, చిన్న పని చేసిన తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగినా అది గుండె సంబంధిత వ్యాధులను సూచిస్తుంది.

Also Read:  Blood Group : హార్ట్ స్ట్రోక్ ఎప్పుడు వస్తుందో బ్లడ్ గ్రూప్ చూసి చెప్పేయొచ్చా..?