Heart : డైట్ లో ఈ చిన్న మార్పులు చేసుకుంటే హృద్రోగాలు మీ దరి చేరవు.

మన శరీరంలోని (Body) అతి ముఖ్యమైన భాగం గుండె. ఇది మొత్తం శరీరాన్ని సక్రమంగా నడిపించే బాధ్యతను కలిగి ఉంటుంది. 

మన శరీరంలోని అతి ముఖ్యమైన భాగం గుండె (Heart). ఇది మొత్తం శరీరాన్ని సక్రమంగా నడిపించే బాధ్యతను కలిగి ఉంటుంది. కానీ ఆహారం, జీవనశైలిలో చోటుచేసుకునే చిన్న చిన్న అజాగ్రత్తలు కూడా మన గుండెపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి మీ జీవనశైలిలో మంచి ఫుడ్ ను భాగంగా చేర్చుకోవడం ద్వారా హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అటువంటి కొన్ని బెస్ట్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

దేశంలో హృద్రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. గుండె జబ్బుల కారణంగా చిన్న వయసులోనే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.  ఈమేరకు వివరాలతో యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ జర్నల్‌లో ప్రత్యేక అధ్యయన నివేదిక ప్రచురితం అయింది. అనారోగ్యకరమైన ఆహారం అనేక గుండె జబ్బులకు (Heart Diseases) కారణమవుతుందని ఈ రిసెర్చ్ లో వెల్లడైంది. ఇక మంచి ఆహారం విషయానికి వస్తే ఈ జాబితాలో చాలా కూరగాయలు, పండ్లు, చిక్కుళ్ళు, గింజలు, చేపలు ఉంటాయి.

DASH డైట్:

DASH డైట్ అంటే హైపర్‌టెన్షన్‌ కట్టడికి అనుసరించే ఆహార ప్రణాళిక. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు ఉన్నాయి. ఈ ఆహారం యొక్క ఉద్దేశ్యం మీ రోజువారీ దినచర్య నుంచి సోడియం, సంతృప్త కొవ్వులు, అదనపు చక్కెర తీసుకోవడాన్ని తగ్గించడమే. ఫలితంగా మీ రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది.

ఫ్లెక్సిటేరియన్ డైట్:

ఈ డైట్ ఫ్లెక్సిబుల్ మరియు వెజిటేరియన్ అనే రెండు పదాలతో రూపొందించబడింది. ఇది ప్రోటీన్స్ , ప్రాసెస్ చేయబడిన మొక్కల ఉత్తమ ఆహారాలను కలిగి ఉంటుంది. అయితే మాంసం ఉత్పత్తులను తీసుకోవడాన్ని తగ్గించాలని ఇది సూచిస్తుంది. బ్రిటీష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. ఫ్లెక్సిటేరియన్ డైట్ తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

లో కార్బ్ ఫుడ్:

ఈ రకమైన ఆహార ప్రణాళికలో పాస్తా, ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర కలిగిన ఆహారాలు, రొట్టె సహా అధిక కార్బోహైడ్రేట్లను తీసుకోవడాన్ని తగ్గించాలి. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ఈమేరకు ఒక అధ్యయన నివేదిక ప్రచురితం అయింది. తక్కువ కేలరీల ఆహారాన్ని తీసుకునే వారు.. అధిక బరువు ఉన్నవారి కంటే ఎక్కువగా గుండె జబ్బుల ముప్పును కలిగి ఉంటారు.

మొక్కల ఆధారిత ఆహారం:

ఇది మరొక రకమైన ఆహార ప్రణాళిక. మీ గుండె ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైనది.  ఈ రకమైన ఆహారంలో కూరగాయలు, పండ్లు, బీన్స్, తృణధాన్యాలు, మాంసంలకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.ఇవి మీ కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

Also Read:  Migraine : మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నారా? అయితే ఈ ఆసనాలను ట్రై చేయండి