Sugarcane Juice: వేసవిలో ఎక్కువగా చెరుకు రసం తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే?

  • Written By:
  • Publish Date - March 22, 2024 / 01:45 PM IST

సమ్మర్ మొదలయ్యింది.. ఎండలు మండిపోతున్నాయి. ఈ వేసవి కాలంలో ప్రజలు ఆహారం కంటే ఎక్కువగా పానీయాలకే అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఇక వేసవికాలంలో మార్కెట్లో రకరకాల జ్యూస్లు, శీతలపానీయాల విక్రయాలు జోరందుకుంటాయి. ఇందులో నిమ్మరసం, మజ్జిగ, పుదీనా వాటర్‌, చెరకు రసం విరివిగా అమ్ముతుంటారు. ముఖ్యంగా వేసవిలో మనకు ఎక్కడ చూసినా కూడా చెరుకు రసం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీంతో వేసవిలో చల్లగా ఉంటుంది కదా అని చాలామంది ఈ చెరుకు రసం తాగడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు..

ఇందులో కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. శరీరంలోని నీటి శాతాన్ని కాపాడుతుంది. దీని వల్ల అనేక వ్యాధులు నయమవుతాయి. ఇది జీర్ణక్రియకు, ఎముకల ఆరోగ్యానికి, కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ అందరూ చెరకు రసం తాగలేరు. ఎందుకంటే చెరకు రసం కొంతమందికి హానికరం. మధుమేహ వ్యాధిగ్రస్తులు చెరకు రసం తాగకూడదు. ఇది తక్కువ గ్లైసెమిక్ సూచిక, అధిక గ్లైసెమిక్ లోడ్ కలిగి ఉంటుంది. దీని కారణంగా ఇది రక్తంలో చక్కెరను ప్రభావితం చేస్తుంది. చెరకు రసంలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. 240 ml చెరకు రసంలో దాదాపు 50 గ్రాముల చక్కెర ఉంటుంది.

ఇది 12 టీస్పూన్లకు సమానం. దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. అదేవిధంగా జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు చెరుకు రసాన్ని తీసుకోకూడదు. ఇందులో ఉండే పోలికోసనాల్ జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. దీనివల్ల కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి అనేక సమస్యలు వస్తాయి. అలాగే స్థూలకాయంతో బాధపడేవారు చెరకు రసాన్ని తీసుకోకూడదు. ఇది అధిక కేలరీల కంటెంట్‌ను కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల బరువు పెరగవచ్చు. అలాగే, ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుంది. మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే, మీరు ఖచ్చితంగా చెరకు రసం తాగకూడదు.

జలుబు వచ్చినా చెరుకు రసం తాగకండి. దీని వినియోగం జలుబు, దగ్గు సమస్యను పెంచుతుంది. దీనిని తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, తలనొప్పి కూడా వస్తుంది. కొందరికి వేసవిలో కూడా దగ్గు జలుబు చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు చెరుకు రసం అస్సలు తాగకూడదు. చెరుకు రసం ఆరోగ్యానికీ మంచిదే కానీ అలా అని ఎక్కువగా తాగితే మాత్రం అనేక రకాల సమస్యలు తప్పవు.