Site icon HashtagU Telugu

Tip : పురాతన కాలం నాటి చిట్కా ఫాలో అయితే మీకు ఆ దిగులు ఉండదు

Fishcurry

Fishcurry

చేపల్ని (Fish Curry) ఇష్టంగా తినేవాళ్లకు ఆదివారం వస్తే పండుగలా ఉంటుంది. చేప పులుసు, చేప ఫ్రై, చేప బిర్యానీ వంటివి రుచికరంగా తినేవాళ్లకు మంచి ఆరోగ్య ప్రయోజనాలూ లభిస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, కాల్షియం వంటి పోషకాలు చేపల్లో మెండుగా ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో చేపల పులుసు ఎంత బాగా వండినా దానిలోంచి నెత్తిన వాసన వస్తే తినాలనే ఆసక్తి పోతుంది. అలాంటి పరిస్థితుల్లో వందేళ్ల నాటి అమ్మమ్మల చిట్కా ఎంతో ఉపయోగపడుతుంది.

Imran Khan : ఇమ్రాన్ ఖాన్‌తో జైలులో ప్రధాని, ఆర్మీ చీఫ్ భేటీ.. డీల్ ఫిక్స్ ?

చేపల (Fish ) ముక్కలకు నెత్తిన వాసన రాకుండా చేయాలంటే ముందుగా వాటిని నిమ్మరసం, ఉప్పుతో బాగా క్లీన్ చేయాలి. కడిగిన తర్వాత అర గంట పాటు పసుపు, కారం, ఉప్పు, నిమ్మరసం వేసి మ్యారినేట్ చేయాలి. ఈ ప్రక్రియ చేప ముక్కలకు మంచి టేస్ట్‌తో పాటు వాసన రాకుండా చేయడంలో సహాయపడుతుంది. తర్వాత చేపల పులుసుకు అవసరమైన మసాలాను ఎండు మిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చి మిర్చి, ధనియాల పొడి మొదలైన వాటితో తయారు చేయాలి.

పులుసు తయారీకి ముందుగా చేప (Fish ) ముక్కలను నూనెలో వేపి పక్కన పెట్టాలి. అదే గిన్నెలో ఉల్లిపాయలు, తయారు చేసిన మసాలా పేస్ట్, చింతపండు రసం వేసి బాగా మరిగించాలి. చివరగా చేప ముక్కలు వేసి 20 నిమిషాల పాటు మూతపెట్టి మగ్గించాలి. కొత్తిమీర చల్లి సర్వ్ చేస్తే, నెత్తిన వాసన లేని కమ్మటి చేపల పులుసు సిద్ధం అవుతుంది. ఒకే ఒక్క చిట్కా పాటిస్తే, రుచి, ఆరోగ్యం రెండూ మీ వంటింట్లో ఉంటాయి.