ఈ రోజుల్లో చాలామంది రాత్రి సమయంలో నిద్ర పోవడం లేదు. పని ఒత్తిడి , ఫోన్ లో ఎక్కువగా మునిగిపోవడమా వంటివి కారణాల వల్ల అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల నిద్ర తీసుకోవడం చాలా మందికి సాధ్యపడటం లేదు. కానీ ఇది ఒక చిన్న సమస్యలా అనిపించినా, దీని వల్ల వచ్చే ప్రభావాలు మాత్రం చిన్నవి కావు. నిద్ర సరిగ్గా లేకపోతే శరీరంలో హార్మోన్ల సమతుల్యత తగ్గిపోతుంది. ముఖ్యంగా ఇన్సులిన్ నియంత్రణ లో గందరగోళం ఏర్పడి, మధుమేహం వంటి వ్యాధులు పుట్టుకొస్తాయి. అలాగే బీపీ, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి.
Hydraa : మాదాపూర్ లో హైడ్రా కూల్చివేతలు.. బడా బిజినెస్ మాన్ పై కేసు నమోదు
నిద్రలేమికి ముఖ్యమైన కారణాల్లో అధిక పని బరువు, ఒత్తిడి, ఫోన్, ల్యాప్టాప్ వాడకం మొదలైనవే. రాత్రిళ్లు స్క్రీన్ టైమ్ ఎక్కువైతే, శరీరంలోని సహజ నిద్ర హార్మోన్ అయిన మెలటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల నిద్రకు ముందు శరీరం సన్నద్ధం కావడంలో ఆటంకం ఏర్పడుతుంది. దీని ప్రభావంగా మనం బాగా నిద్రపట్టక, ఒత్తిడి పెరగడం, అలసట, ఉద్యోగంలో ప్రొడక్టివిటీ తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. చాలా మందికి ఈ సమస్య కొంత కాలానికి అలవాటై, జీవన శైలిని పూర్తిగా దెబ్బతీస్తుంది.
నిద్రలేమి సమస్యను ఎదుర్కొనాలంటే, ముందుగా నిద్రపోయే ముందు స్క్రీన్ టైమ్ తగ్గించడం, దైనందిన ఒత్తిడిని తగ్గించటం అవసరం. సాయంత్రం తర్వాత తేలికపాటి వ్యాయామం, మెడిటేషన్, పుస్తకం చదవడం లాంటి చర్యలు మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి. అలాగే సమతుల్యమైన ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యమే. నిద్ర సరిగా వచ్చినప్పుడు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాక, జీవనశైలి వ్యాధులను కూడా దూరంగా ఉంచుకోవచ్చు. మంచి నిద్ర అనేది ఆరోగ్యకరమైన జీవన విధానానికి బలమైన పునాది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.