Site icon HashtagU Telugu

Ayurveda Tips : మనం ఈ విధంగా భోజనం చేస్తే ఆరోగ్యంగా ఉంటాం..!

Ayurveda Inflammation

Ayurveda Inflammation

చాలా వరకు జబ్బులు కడుపు నొప్పితోనే స్టార్ట్‌ అవుతాయి. మన కడుపు హెల్తీగా ఉంటే.. మనం చాలా వరకు ఆరోగ్యంగా (Healthy) ఉంటాం. ఈ రోజుల్లో గ్యాస్‌ (Gas), మలబద్ధకం (Constipation), ఎసిడిటీ (Acidity), అపానవాయువు (Flatulence), యాసిడ్ రిఫ్లక్స్ (Acid Reflux), డయేరియా (Diarrhea), వాంతులు, కడుపు నొప్పి, పేగు అవరోధం, కడుపులో మంచి, ఇన్ఫ్లమేషన్‌ (Inflammation), పేగు (Intestine) సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. ఈ ఆరోగ్య (Health) సమస్యలకు ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లే. మనం ఆరోగ్యంగా ఉండటానికి.. మంచి ఆహారం (Food) చాలా అవసరం. మనం తీసుకునే ఆహార నాణ్యత (Food Quality), సమయం (Time), పరిమాణం (Portion) పై శ్రద్ధ వహించాలి. మనం ఆహారం తిసుకునేప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే.. అరోగ్య సమస్యలు దూరంగా ఉంటాయి.

మీరు పౌష్టికాహారం తీసుకుంటున్నా.. దాన్ని సరైన సమయంలో, తగిన పరిమాణంలో తీసుకోకపోతే.. లాభం కంటే హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆయుర్వేద (Ayurveda) వైద్యురాలు దీక్షా భావ్‌సర్‌ ఆహారం తీసుకునేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. వీటిని అనుసరిస్తే.. కడుపు ఆరోగ్యంగా ఉంటుందిని, జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుందని, తీవ్ర ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని చెప్పారు.

ఆరు రుచులను మీ డైట్‌లో చేర్చుకోండి:

ఆయుర్వేదం (Ayurveda) ఆరు రుచులను (తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు) పేర్కొంది. ప్రతి రుచి శరీరంలో శక్తిని, కమ్యూనికేషన్‌ను సృష్టిస్తుంది. శరీరాన్ని శక్తివంతంగా, ఫిట్‌గా మార్చడానికి అన్ని రుచులు అవసరం. మీరు తినే ఆహారంలో చిన్నమొత్తంలో ప్రతి టేస్ట్‌ను చేర్చడానికి ప్రయత్నించండి.

నిద్రపోయే మూడు గంటల ముందే డిన్నర్‌ పూర్తి చేయండి:

నిద్రపోయే మూడు గంటల ముందే భోజనం పూర్తిచేయండి. నిద్రలో.. శరీరానికి, మెదడుకు విశ్రాంతి అవసరం, దీంతో ఇవి స్వయంగా హీల్‌ అవుతాయి. మన శరీరంలోని శక్తి.. జీర్ణక్రియకు డైవర్ట్‌ అయితే.. మెంటల్‌ హీలంగ్‌, ఫిజికల్‌ హీలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆగిపోతుంది. ఈ అసమతుల్యతను నివారించడానికి ఆయుర్వేదం రాత్రిపూట నిద్రపోయే మూడు గంటల ముందే తేలికపాటి ఆహారం తీసుకోవాలని సూచించింది.

హెల్బల్‌ టీ తాగండి:

మీ బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌ మధ్యలో హెర్బల్‌ టీ తీసుకోండి. హెర్బల్‌టీ తాగితే చిరుతిండి క్రేవింగ్‌ తగ్గుతుంది. హెర్బల్‌టీ శరీరాని డీటాక్స్‌ చేస్తుంది. జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది.

లంచ్‌ టైమ్‌లో ఎక్కువగా తినండి:

పగలు, మన జీర్ణక్రియ వేగంగా పనిచేస్తుంది. భోజనం సమయంలో ఎక్కువగా తీసుకుంటే.. మన జీర్ణవ్యవస్థ తక్కువ శక్తితో పోషకాలను విచ్ఛిన్నం చేసి శరీరానికి అందిస్తుంది. కష్టంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను భోజనం సమయంలో తీసుకుంటే మంచిది.


Also Read:  Weight Loss Plan : బరువు తగ్గాలనుకునే వారికి కీటో డైట్ ప్లాన్..!