వెల్లుల్లిని (Garlic) మనం వండుకునే వంటల్లో వేయడం వల్ల ఆహారం రుచి రెట్టింపు అవుతుంది. ప్రతి వంటలోనూ వెల్లుల్లిని విస్తృతంగా ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు దీనిని తినాలని సూచించారు. వెల్లుల్లి (Garlic) చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ కొన్ని వ్యాధులతో బాధపడేవారు వెల్లుల్లికి పూర్తిగా దూరంగా ఉండాలి. వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని యూపీలోని అలీఘర్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సరోజ్ గౌతమ్ చెబుతున్నారు. వెల్లుల్లి శీతాకాలంలో చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వేసవిలో కూడ వెల్లుల్లిని తినవచ్చు.. కానీ దాని తక్కువ మొత్తంలో తీసుకుంటే మంచిదట. అధిక రక్తపోటు, గ్యాస్, కడుపు నొప్పి వంటి కొన్ని సమస్యలతో బాధపడేవారు వెల్లుల్లి తినకూడదు. కాదని తింటే మాత్రం అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది.
వెల్లుల్లి (Garlic) ఎవరికి ప్రమాదకరం?
ఆయుర్వేద వైద్యుల ప్రకారం, అధిక రక్తపోటు, అసిడిటీ, గ్యాస్‌తో బాధపడేవారు, కడుపులో మంట, లూజ్ మోషన్‌తో బాధపడేవారు వెల్లుల్లిని తినకూడదు. తింటే బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది కొన్నిసార్లు గుండెపోటుకు కారణం అవుతుంది. అంతే కాకుండా వెల్లుల్లి తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, స్టమక్ ఇరిటేషన్ కూడా పెరుగుతాయి. లూజ్ మోషన్ సమయంలో కూడా వెల్లుల్లిని తీసుకోవడం మానేయాలి. అధిక కొలెస్ట్రాల్ రోగులకు కూడా వెల్లుల్లి హానికరంగా పరిగణించబడుతుంది. ఈ సమస్యలు ఉన్నప్పటికీ మీరు వెల్లుల్లిని తినాలనుకుంటే మాత్రం చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా దాని దుష్ప్రభావాల నుంచి బయటపడే అవకావం ఉంటుంది.
Also Read: Chicken: చికెన్ ఇలా వండుకుని తింటే బరువు తగ్గుతారట..