Site icon HashtagU Telugu

Paneer: మీరు తినే ప‌నీర్ మంచిదో? కాదో తెలుసుకోండిలా?!

Paneer

Paneer

Paneer: మన వంటగదిలో ఉండే పనీర్ (Paneer) మనకు ఆరోగ్యాన్ని ఇవ్వడం కాదు, అనారోగ్యాన్ని కలిగిస్తుందని మీకు తెలుసా? అవును కల్తీ ఆహార పదార్థాల జాబితాలో పనీర్ కూడా చేరింది. గతంలో కల్తీ పాలు, స్వీట్ల గురించి చాలా వార్తలు వచ్చాయి. ఇప్పుడు పనీర్ కూడా కల్తీ అవుతోందని నివేదికలు చెబుతున్నాయి. పనీర్ తయారు చేయడానికి నాసిరకం పాలు ఉపయోగించడమే కాకుండా ఇప్పుడు మార్కెట్లో లభించే పనీర్.. షాంపు, యూరియా, స్టార్చ్‌తో తయారు చేస్తున్నారు. అలాంటి పనీర్ తింటే ఆసుపత్రి పాలవ్వడం ఖాయం.

కల్తీ పనీర్‌తో నష్టాలు

కల్తీ పనీర్ తినడం వల్ల కలిగే ప్రధాన నష్టాలు

జీర్ణ సమస్యలు: ఇలాంటి పనీర్ తినడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. ఇది ప్రేగుల ఆరోగ్యాన్ని పాడు చేసి, గట్‌లో చెడు బ్యాక్టీరియా స్థాయిని పెంచుతుంది.

గుండె జబ్బులు: యూరియా కలిపిన పనీర్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

ఎముకల బలహీనత: నకిలీ పనీర్ తినడం వల్ల ఎముకలు బలహీనపడతాయి.

క్యాన్సర్ రిస్క్: కొన్ని నివేదికల ప్రకారం.. నకిలీ పనీర్ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.

ఫుడ్ పాయిజనింగ్: నకిలీ పనీర్ తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం పెరుగుతుంది.

కాలేయం, కిడ్నీ సమస్యలు: ఎక్కువ కాలం నకిలీ పనీర్ తింటే కాలేయం (liver), కిడ్నీల (kidney)కు సంబంధించిన వ్యాధులు రావచ్చు.

Also Read: BMW Models: సెప్టెంబర్ 1 నుండి బీఎండ‌బ్ల్యూ కార్ల ధరలు పెంపు!

నకిలీ పనీర్‌ను ఎలా గుర్తించాలి?

అయోడిన్ టెస్ట్

పనీర్ కల్తీ అయిందో లేదో తెలుసుకోవడానికి అయోడిన్ సొల్యూషన్‌తో పరీక్షించవచ్చు. ముందుగా పనీర్‌ను వేడి నీటిలో వేసి రెండు నిమిషాలు ఉడికించండి. ఆ తర్వాత దానిపై 2-3 చుక్కల అయోడిన్ సొల్యూషన్ వేసి చూడండి. పనీర్ రంగు నలుపు లేదా గోధుమ రంగులోకి మారితే అది కల్తీ పనీర్ అని అర్థం.

కందిపప్పు పిండి టెస్ట్

ఈ పరీక్ష కోసం పనీర్ ముక్కపై కొద్దిగా కందిపప్పు (అరహర్ దాల్) పిండి చల్లి చూడండి. పనీర్ రంగు ముదురు పసుపు రంగులోకి మారితే అందులో యూరియా కలిపినట్లు అర్థం. రంగు మారకపోతే పనీర్ అసలైనది.

వాసన పరీక్ష

మాస్టర్‌చెఫ్ పంకజ్ భదౌరియా ప్రకారం.. అసలు పనీర్‌కు పాల వాసన, కొద్దిగా పుల్లటి వాసన వస్తుంది. నకిలీ పనీర్‌కు చాలా ఘాటైన పాల, సింథటిక్ వాసన వస్తుంది. అంతేకాకుండా, నకిలీ పనీర్ రబ్బరు మాదిరిగా గట్టిగా ఉంటుంది. అసలు పనీర్‌ను నీటిలో వేసి ఉడికిస్తే అది మరింత మృదువుగా మారుతుంది. కానీ నకిలీ పనీర్ ముందు నీటిని వదిలేస్తుంది.

మార్కెట్‌లో దొరికే కల్తీ పనీర్‌కు బదులుగా ఇంట్లోనే పనీర్ తయారు చేసుకోవడం చాలా మంచిది. పనీర్ తయారు చేయడం చాలా సులభం. చిక్కటి పాలను కొంచెం పుల్లటి పదార్థం (నిమ్మరసం లేదా వెనిగర్) వేసి విరిగేలా చేసి, ఆ తర్వాత విరిగిన పాలు (curdled milk)పై బరువు పెట్టి కొన్ని గంటల పాటు అలాగే ఉంచాలి. ఇలా చేస్తే ఇంట్లోనే సులభంగా, ఆరోగ్యకరమైన పనీర్ సిద్ధమవుతుంది.