Cancer Risk: వ్యాయామం ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా క్యాన్సర్ (Cancer Risk) వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తుందని ఇటీవల ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. ఈ పరిశోధన ప్రకారం రోజూ కేవలం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్ వంటి వాటి ప్రమాదం 30% వరకు తగ్గుతుందని తేలింది. ఈ ఫలితాలు రోజూ 30-40 నిమిషాల వ్యాయామం ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టం చేస్తున్నాయి.
కొత్త అధ్యయనం ఏం చెబుతోంది?
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరచి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. కొత్త పరిశోధన ప్రకార.. కేవలం 30 నిమిషాల వ్యాయామం వల్ల TNF ఆల్ఫా వంటి యాంటీ-ఇన్ఫ్లమేటరీ అంశాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. అలాగే, ఇది హార్మోన్ల సమతుల్యతను కాపాడి, పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ ప్రభావం వల్ల రొమ్ము, పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదం 30% నుంచి 40% వరకు తగ్గుతుందని అధ్యయనం పేర్కొంది.
ఎలాంటి వ్యాయామాలు చేయాలి?
అధ్యయనం ప్రకారం మీరు చేయాల్సిన వ్యాయామం తీవ్రత ముఖ్యమైనది.
హై-ఇంటెన్సిటీ వర్కౌట్‌లు: సైక్లింగ్, ఈత లేదా రన్నింగ్ వంటి హై-ఇంటెన్సిటీ వ్యాయామాలు 30 నిమిషాల పాటు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
లో-ఇంటెన్సిటీ వర్కౌట్‌లు: యోగా లేదా నడక వంటి లో-ఇంటెన్సిటీ వ్యాయామాలను ఎక్కువ సమయం పాటు చేయడం కూడా శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
Also Read: Kunki Elephants: కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ విజయవంతం.. డిప్యూటీ సీఎం పవన్ హర్షం!
వ్యాయామం చేసేటప్పుడు గమనించాల్సిన అంశాలు
- నిలకడ ముఖ్యం: గంటల తరబడి జిమ్‌లో శ్రమించడం కంటే రోజూ కేవలం 30 నిమిషాల వ్యాయామం చేయడం ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుంది.
- క్రమంగా ప్రారంభించండి: మీరు కొత్తగా వ్యాయామం మొదలుపెడుతుంటే మొదట లో-ఇంటెన్సిటీ వ్యాయామాలు, ఉదాహరణకు నడకతో ప్రారంభించడం మంచిది.
- విభిన్న వ్యాయామాలు: క్రమంగా మీ దినచర్యలో స్ట్రెచింగ్, స్వల్ప కార్డియో వ్యాయామాలను చేర్చుకోండి.
- సమతుల్యత పాటించండి: వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నిద్ర కూడా అవసరం. మొదటి రోజు నుంచే అధిక శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం వల్ల లాభానికి బదులు నష్టం జరగవచ్చు. ఈ నివేదిక ప్రకారం.. చిన్న చిన్న వ్యాయామాలతోనూ తీవ్రమైన ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు.