మామూలుగా చాలామంది అధిక బరువు తగ్గించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఎక్కువ శాతం మంది హోమ్ రెమిడీలను ఫాలో అవుతూ ఉంటారు. ఇంకొందరు వ్యాయాయలు చేయడం, వాకింగ్ చేయడం లాంటివి చేస్తుంటారు. కొన్ని కొన్ని సార్లు వాటి వల్ల ఎటువంటి ఫలితాలు కలగక దిగులు చెందుతూ ఉంటారు. మరి ఏం చేస్తే అధిక బరువును తగ్గించుకోవచ్చో, అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీ శరీర బరువు తగ్గడానికి మీ ఆహారంలో మెంతులు చేర్చడం మంచిది.
We’re now on WhatsApp. Click to Join
వీటిని ఎప్పటి నుంచో ఔషధంగా ఉపయోగిస్తున్నారు. వీటిలో ఫైబర్, ఐరన్, విటమిన్ A, D వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ విత్తనాలను సరిగ్గా తీసుకుంటే, బరువు సులభంగా తగ్గవచ్చు. బరువు తగ్గడానికి మెంతులు ప్రయోజనకరంగా ఉంటాయి. మెంతి గింజలలో కరగని ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియకు మంచిది. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను బయటకు పంపుతుంది. ఈ సూపర్ ఫుడ్, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. మొత్తం మీద, మెంతులలో లభించే పోషకాలు బరువు తగ్గడంలో ప్రభావవంతంగా ఉన్నాయని రుజువైంది.
Also Read: Green Banana: అరటిపండు, అరటికాయ ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
బరువు తగ్గడానికి మీరు ఆహారంతో పాటు మెంతుల నీరు కూడా తాగాలి. ఒక టేబుల్ స్పూన్ మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. తర్వాత వడకట్టి ఆ నీటిని తెల్లారి ఖాళీ కడుపుతో తాగాలి. మెంతి టీ చేయడానికి మీకు ఒక టీస్పూన్ మెంతి గింజలు, దాల్చిన చెక్క, అల్లం ముక్కలు అవసరం. ఒక పాత్రలో నీటిని మరిగించి అందులో ఈ మూడు పదార్థాలనూ కలపాలి. ఇది సిద్ధం చేయడానికి 5 నిమిషాల కంటే తక్కువ సమయం పడుతుంది. ఈ టీ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అల్లం, దాల్చినచెక్క రెండింటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.
Also Read: Apple vs Guava: ఏ పండు ఎక్కువ ఆరోగ్యకరం.. జామకాయ? యాపిలా?
రెండూ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. రెండు టేబుల్ స్పూన్ల మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఈ మొలకెత్తిన మెంతి గింజలను ఉదయాన్నే తినండి. మీరు ఖాళీ కడుపుతో కూడా తినవచ్చు. అదనంగా, వాటిని భోజనంతో పాటూ తినవచ్చు. దీని కోసం మీరు మెంతుల గింజలను రుబ్బుకోవాలి. ఆ తర్వాత అందులో తేనె మిక్స్ చేసి తినాలి. అలాగే ఈ మెంతులను నీటిలో వేసి మరిగించవచ్చు. ఆ తరువాత, తేనె, నిమ్మరసంతో కలిపి హెర్బల్ టీగా తీసుకోవచ్చు.