Site icon HashtagU Telugu

Skin Care: 21 రోజుల్లో మీరు అందంగా మారాలంటే ఈ టిప్స్ ఫాలో కావాల్సిందే!

Skin Care

Skin Care

Skin Care: శీతాకాలంలో దాదాపు ప్రతి ఒక్కరి చర్మం పొడిగా, నిర్జీవంగా మారుతుంది. ఇది మీ చర్మం మెరుపును (Skin Care) దెబ్బ‌తీస్తుంది. మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అనేక పద్ధతులను అవలంబిస్తాం. కానీ కొన్నిసార్లు ఈ పద్ధతులు పని చేయవు. ఇటువంటి పరిస్థితిలో మీరు మీ చర్మానికి బీట్‌రూట్‌ను ఉపయోగించవచ్చు. చాలా మంది బీట్‌రూట్‌ను కూరగాయగా కూడా తింటారు. ఇందులో మాంగనీస్, పొటాషియం, ఐరన్, ఫోలేట్, విటమిన్ బి6, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. ఇవి మీ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. బీట్‌రూట్‌లో ఏయే పదార్థాలను కలిపి ముఖానికి రాసుకోవచ్చో తెలుసుకుందాం?

మొటిమలు పోతాయి

బీట్‌రూట్‌ని ముఖానికి రాసుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. మొటిమలను తొలగించడం నుండి మచ్చల వరకు అన్నింటిలో బీట్‌రూట్ చాలా మంచిదని భావిస్తారు.

బీట్‌రూట్- గంధం

మచ్చలను తొలగించడానికి మీరు బీట్‌రూట్, చందనంతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం బీట్‌రూట్ పేస్ట్‌లో చందనం పొడిని కలిపి చర్మానికి అప్లై చేయాలి. 15 నిమిషాలు అలాగే ఉంచి ఆపై మీ ముఖం కడగాలి. దీంతో పిగ్మెంటేషన్ సమస్యను కూడా దూరం చేసుకోవచ్చు.

బీట్‌రూట్- అలోవెరా జెల్

బీట్‌రూట్- అలోవెరా జెల్ శీతాకాలంలో చర్మపు తేమను నిర్వహించడానికి మంచి మార్గంగా నిరూపించవచ్చు. ఇందుకోసం బీట్‌రూట్ పేస్ట్‌లో అలోవెరా జెల్‌ను మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడంలో సహాయపడుతుంది.

Also Read: TGRSA: రెవెన్యూ శాఖ పున‌రుద్ధ‌ర‌ణ‌లో భాగ‌మ‌వుతాం: టీజీఆర్ఎస్ఏ

బీట్‌రూట్- పెరుగు

బీట్‌రూట్- పెరుగు చర్మ ఛాయను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇందుకోసం బీట్‌రూట్ ముక్కను తీసుకుని బ్లెండర్‌లో పేస్ట్ చేయాలి. అందులో పుల్లటి పెరుగు, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. అప్లై చేసిన 15 నిమిషాల తర్వాత కడగాలి.

బీట్‌రూట్- బేకింగ్ పౌడర్-వేప పొడి

మీకు మొటిమల సమస్య ఉంటే 2 టీస్పూన్ల బీట్‌రూట్ పేస్ట్‌లో 2 టీస్పూన్ల బేకింగ్ పౌడర్, 1 టీస్పూన్ వేప పొడిని కలపండి. ఈ పేస్ట్‌ను వారానికి రెండుసార్లు మీ ముఖానికి అప్లై చేయండి.

బీట్‌రూట్ ప్రయోజనాలు

బీట్‌రూట్‌లో విటమిన్ సి, ఇతర పోషకాలు ఉన్నాయి. ఇది మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు మీ చర్మానికి మేలు చేస్తుంది. ఇది ఇన్ఫెక్షన్ల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.