Belly Fat : పొట్ట తగ్గించాలనుకుంటున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. ఈ పొట్ట తగ్గడానికి మనం తీసుకునే ఆహారం(Food) విషయంలో కొన్ని పద్ధతులు పాటించాలి.

  • Written By:
  • Publish Date - July 4, 2023 / 08:30 PM IST

ఇదివరకు రోజుల్లో పెద్దవాళ్లకు, అధిక బరువు ఉన్నవారికి మాత్రమే పొట్ట(Belly Fat)ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. ఈ పొట్ట తగ్గడానికి మనం తీసుకునే ఆహారం(Food) విషయంలో కొన్ని పద్ధతులు పాటించాలి. పొట్ట తగ్గడానికి మనం రోజూ వ్యాయామం(Exercise) చేయాలి. దీని వలన పొట్ట చుట్టూ ఉన్న కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

ఒక రోజులో ఎనిమిది నుండి పది లీటర్ల నీరు తాగాలి. దీని వలన మన శరీరంలో డాగ్ సెల్స్ తొలగిపోతాయి ఇంకా మన శరీరంలో మెటబాలిజం మెరుగుపడుతుంది. దీని వలన కూడా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గుతుంది. మనం అందరం రోజూ ఉదయం టీ లేదా కాఫీ తాగుతూ ఉంటాము. దానిలో ఉండే పంచదార వలన మన శరీరంలో కొలెస్ట్రాల్ చేరుతుంది. కాబట్టి టీ లేదా కాఫీ తాగేటప్పుడు దానిలో పంచదారకు బదులుగా తేనె కలుపుకొని తాగాలి ఇలా చేయడం వలన కొలెస్ట్రాల్ మన శరీరంలోనికి చేరే అవకాశం తగ్గుతుంది.

కరివేపాకును ఆహారంలో కానీ మజ్జిగలో గాని తీసుకుంటే మన శరీరంలో చెడు కొవ్వును తగ్గించి మంచి కొవ్వును పెంచుతుంది. వాల్నట్స్, బాదం, వేరుశనగ వంటి వాటిని స్నాక్స్ రూపంలో తీసుకోవాలి. ఇవి మన శరీరంలో చెడు కొవ్వు చేరకుండా మంచి కొవ్వును పెరిగేలా చేస్తాయి. మనం ఆహారంలో భాగంగా బ్రొకోలీని వారానికి ఒకసారి తీసుకుంటే పొట్ట తగ్గుతుంది. ఒక గ్లాసు నీళ్లలో ఒక స్పూన్ దాల్చినచెక్క పొడిని వేసి ఆ నీటిని మరిగించాలి. మరిగిన తరువాత ఆ నీటిని వడగట్టాలి. ఆ నీటిలో ఒక స్పూన్ తేనె కలిపి రోజూ ఉదయాన్నే తాగితే పొట్ట తగ్గుతుంది. రెండు నెలల్లో మంచి ఫలితం కనబడుతుంది.

 

Also Read : Yoga Asanas: ఈ సీజన్ లో మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా.. అయితే, ఈ యోగాసనాలను ట్రై చేయండి..!