Site icon HashtagU Telugu

Buckwheat Dosa : బుక్వీట్ దోశ.. ఆరోగ్యానికి మంచిది.. ఈజీగా ఇలా చేసుకోవచ్చు..

how to prepare Buckwheat Dosa in home and benefits of Buckwheat Dosa

how to prepare Buckwheat Dosa in home and benefits of Buckwheat Dosa

బుక్వీట్(Buckwheat) పిండితో అనేక రకాల టిఫిన్లు చేసుకోవచ్చు. బుక్వీట్ అనేది ఇది గోధుమ పిండి కాదు గడ్డి జాతికి చెందినది కాదు ఇది ఒక రకమైన పండ్ల విత్తనాల నుండి తీసే పిండి. బుక్వీట్ పిండిలో ఫైబర్, ఇనుము అధికంగా ఉంటాయి. ఇది తినడం వలన రక్తహీనత తగ్గుతుంది, డయాబెటిస్ ఉన్నవారు కూడా దీనిని తినవచ్చు. అయితే బుక్వీట్ పిండితో దోశలు వేసుకుంటే వాటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. బుక్వీట్ పిండి లేదా గింజలు బయట షాపుల్లో దొరుకుతాయి.

బుక్వీట్ దోశ(Buckwheat Dosa) తయారీకి కావలసిన పదార్థాలు..

* ఒక కప్పు బుక్వీట్ పిండి
* పావు కప్పు మినపపప్పు (నానబెట్టినది)
* ఒక స్పూన్ నూనె
* ఒక స్పూన్ ఆవాలు
* ఇంగువ చిటికెడు
* రెండు స్పూన్లు సన్నగా తరిగిన పచ్చిమిర్చి
* రెండు స్పూన్లు కొత్తిమీర
* ఉప్పు తగినంత

బుక్వీట్ పిండిని, మినపపప్పును కొన్ని నీళ్ళు పోసి మిక్సి లో వేసి మెత్తగా అయ్యేలా పట్టుకోవాలి. పొయ్యి మీద ఒక చిన్న మూకుడు పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె వేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు ఉంచాలి తరువాత కొద్దిగా ఇంగువ వేసి దించేయాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, బుక్వీట్ మినపపప్పు మిశ్రమంలో నీటిని కలిపి దోశపిండి లాగా చేసుకోవాలి. పెనం పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దోశలా వేసుకోవాలి. అది రెండు వైపులా బంగారు గోధుమరంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అంతే బుక్వీట్ దోశ రెడీ దీనికి పల్లీల చట్నీ పెట్టుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బుక్వీట్ దోశ.

 

Also Read : Eggs in Winter: చలికాలంలో ప్రతిరోజు గుడ్డు తింటే ఏం జరుగుతుందో తెలుసా?