Site icon HashtagU Telugu

Jogging – Running : జాగింగ్, రన్నింగ్.. ఎలా చేయాలి?

how to do Jogging Running and Benefits

how to do Jogging Running

బరువు తగ్గడం, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కాస్త కష్టమైన పని, శ్రమతో కూడిన పని. మనం ఏవైనా వ్యాయామాలు చేయాలి. కానీ మనకు వ్యాయామాలు చేయడానికి సరైన సమయం లేకపోతే మనం మార్నింగ్ టైంలో లేదా ఈవెనింగ్ టైంలో వాకింగ్ లేదా జాగింగ్(Jogging), రన్నింగ్(Running) చేయవచ్చు. మనం జిమ్ కి వెళ్లి వ్యాయామాలు చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ జాగింగ్ లేదా రన్నింగ్ అనేది మనం మన ఇంటి చుట్టుపక్కల ప్లేసెస్ లో కూడా చేయవచ్చు.

అయితే రన్నింగ్ చేసే సమయంలో మనకు ఏవైనా దెబ్బలు తగిలే అవకాశం ఉంది. కాబట్టి జాగింగ్ ఎక్కువగా చేయడం మంచిది. జాగింగ్ చేసేటప్పుడు మనం ఒక సరైన స్పీడ్ లో వెళ్ళాలి. అంతే కానీ స్పీడ్ పెంచడం లేదా తగ్గించడం వంటివి చేయకూడదు. జాగింగ్ ను రోజుకు ఒక గంట చొప్పున చేస్తే అది మన శరీరంలో మూడు వందల నుండి నాలుగు వందల వరకు క్యాలరీలు ఖర్చు అవుతాయి. మనం రోజూ జాగింగ్ చేయడం వలన మన శరీరం అలసిపోయినట్లు అయితే మధ్యలో ఒక రోజు విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడు మనకు అలసట తగ్గుతుంది.

మీరు జాగింగ్ చేయాలన్నా రన్నింగ్ చేయాలన్నా మృదువైన ఉపరితలాన్ని ఎంచుకోవాలి. వాకింగ్ లేదా రన్నింగ్ చేసేటప్పుడు మన కాలి మడమ నేలకు తాకకూడదు. మడమ నేలను తాకితే నడక నెమ్మదిస్తుంది. వాకింగ్ లేదా రన్నింగ్ మొదలుపెట్టేటప్పుడు కొన్ని వామప్ వ్యాయామాలు చేయడం మంచిది. వాకింగ్ లేదా రన్నింగ్ చేసేటప్పుడు మనం డీహైడ్రాషన్ కి గురవకుండా మధ్య మధ్యలో మంచి నీళ్లు లేదా జ్యూస్ లు తాగడం మంచిది. ఇప్పుడే బరువు తగ్గడానికి ప్రయత్నించే వారు మొదట జాగింగ్ చేయాలి దానికి అలవాటు పడిన తరువాత కొన్ని నెలలకు రన్నింగ్ కి మారవచ్చు.

 

Also Read : Mung Bean: పెసరపప్పుతో ఇలా చేస్తే చాలు మొటిమలు తగ్గడంతో పాటు?