ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ (Diabetes ) ఒకటి. భారతదేశం చైనా తర్వాత రెండో స్థానంలో ఉండటం ఈ వ్యాధి ప్రబలతను చూపిస్తోంది. ఇది సాధారణంగా రక్తంలోని గ్లూకోజ్ స్థాయి నియంత్రణలో గల లోపం వల్ల ఏర్పడుతుంది. చాలా మంది దీన్ని గమనించక పోవడం వల్ల, ఆలస్యం అయ్యే సరికి దాని ప్రభావం తీవ్రమవుతుంది. అందుకే డయాబెటిస్‌ను ముందే గుర్తించడం ఎంతో అవసరం.
డయాబెటిస్ లక్షణాలు ఇవే
డయాబెటిస్‌ను ముందుగానే గుర్తించడానికి కొన్ని ముఖ్యమైన లక్షణాలను గమనించాలి. అందులో ప్రధానమైనవి – ఎక్కువ దాహం వేయడం, నీళ్లు తాగినా దాహం తీరకపోవడం, తరచూ మూత్ర విసర్జన రావడం, ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం, అలసటగా అనిపించడం, బలహీనంగా ఉండడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇది శరీరంలో ఇన్సులిన్ పనితీరు సరిగా లేకపోవడంతో గ్లూకోజ్ శక్తిగా మారకపోవడం వల్ల జరుగుతుంది. అంతే కాదు డయాబెటిస్ ఉన్నవారిలో చూపు మందగించడం, గాయాలు త్వరగా నయం కాకపోవడం వంటి సమస్యలు కూడా కనిపిస్తాయి. కాళ్లు, చేతులలో తిమ్మిర్లు రావడం, పాదాలలో సూదులతో కుచ్చినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే, ఇవి నరాలపై డయాబెటిస్ ప్రభావాన్ని సూచించవచ్చు. దీన్ని అశ్రద్ధ చేస్తే ఇది కిడ్నీలకు, కళ్లకు, గుండెకు, నరాలకు భారీ నష్టం కలిగించే ప్రమాదం ఉంటుంది.
Balakrishna : ఆ ప్రకటనలను నమ్మోదంటూ ప్రజలకు హెచ్చరిక జారీ చేసిన బాలకృష్ణ
పై లక్షణాలు కనిపించిన వెంటనే బ్లడ్ షుగర్ టెస్ట్ (FBS, PPBS, HbA1c) వంటి పరీక్షలు చేయించుకోవాలి. ఈ టెస్టులు డయాబెటిస్ స్థాయిని స్పష్టంగా తెలియజేస్తాయి. డయాబెటిస్‌ను తొలిదశలోనే గుర్తించి ఆహార నియమాలు, వ్యాయామం, మందులతో సమర్థవంతంగా నియంత్రించవచ్చు. జీవన శైలిలో మార్పులు చేసి దీర్ఘకాలిక సమస్యల నుంచి మనల్ని మనమే కాపాడుకోవచ్చు.