Fatigue : త్వరగా అలిసిపోతున్నారా? ఈ పదార్థాలు తినండి..

మనలో అలసటను(Fatigue) తగ్గించుకోవడానికి కొన్ని రకాల ఆహారపదార్థాలను రోజూ తినాలి.

  • Written By:
  • Publish Date - February 3, 2024 / 09:15 AM IST

ఈ మధ్యకాలంలో చాలామంది కొంత సమయం పని చేయగానే తొందరగా అలసిపోతున్నారు. అయితే మనలో అలసటను(Fatigue) తగ్గించుకోవడానికి కొన్ని రకాల ఆహారపదార్థాలను రోజూ తినాలి. దీని వలన మనకు తక్షణం శక్తి(Energy) లభిస్తుంది. అలసట కూడా తగ్గుతుంది.

* అరటిపండు తినడం వలన మనకు వెంటనే శక్తి వస్తుంది. దీని వలన అలసట తగ్గుతుంది.
* అవకాడో తినడం వలన మనకు తక్షణం శక్తి లభిస్తుంది. అలసట తగ్గుతుంది.
* పుట్టగొడుగుల్లో ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్ బి, పోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి తక్షణం శక్తిని అందజేస్తాయి.
* ఓట్ మీల్స్ వంటి తృణధాన్యాలు ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన మనలో అలసట తగ్గుతుంది.
* డ్రై ఫ్రూట్స్ తినడం వలన వాటిలోని ఫైబర్ మనకు పోషకాలను అందించి అలసటను తగ్గిస్తుంది.
* గుమ్మడి గింజలలో జింక్ ఎక్కువగా ఉంటుంది. ఇవి తినడం వలన మనలో అలసట తగ్గుతుంది.
* పుచ్చకాయను తినడం వలన దానిలో ఉండే మినరల్స్ మనకు అలసటను తగ్గించడానికి సహాయపడతాయి.
* చియా సీడ్స్ లో ఉండే కొవ్వులు, ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ మన శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. అలసటను తగ్గిస్తాయి.
* పాలకూరలో ఉండే ఐరన్ మన శరీరానికి ఆక్సీజన్ సరఫరా అందేలా చేస్తుంది. దీని వలన మనలో అలసట పోతుంది.

ఇలా పలు రకాల ఆహారపదార్థాలని రోజూ మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన మన శరీరంలోని అలసటని తగ్గించుకొని ఎనర్జీని పెంచుకోవచ్చు.

 

Also Read : Concentration : ఏకాగ్రతను పెంచుకోవడానికి ఏం చేయాలి?