Site icon HashtagU Telugu

Cough: జలుబు, దగ్గు సమస్యలా? మందులు లేకుండా ఉపశమనం పొందొచ్చు ఇలా!

Cough

Cough

Cough: చాలా మంది ప్రజలు వేసవి అయినా.. చలికాలం అయినా, వాతావరణంలో కొద్దిపాటి మార్పు వచ్చినా వెంటనే జలుబు, దగ్గు (Cough), ముక్కు దిబ్బడతో బాధపడుతుంటారు. దీని కారణంగా ప్రజలు తరచుగా మందులపై ఆధారపడవలసి వస్తుంది. తమ ఆరోగ్యం కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తారు. మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతూ మందులు లేకుండా కేవలం ఇంటి చిట్కాలతో దగ్గు, జలుబు నుండి ఉపశమనం పొందాలనుకుంటే ఇకపై చింతించాల్సిన అవసరం లేదు.

వైద్యుల సూచించిన ప్ర‌కారం.. ప్రభావవంతమైన, పరీక్షించిన ఒక అద్భుతమైన చిట్కాను మీకు అందిస్తున్నాము. ఇది మీకు దగ్గు నుండి త్వరగా ఉపశమనం కలిగించడమే కాకుండా మీ రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తుంది.

Also Read: Nitish Kumar: బీహార్ సీఎంగా నితీష్ కుమార్.. మంత్రిత్వ శాఖలకు న‌యా ఫార్ములా?!

జలుబు-దగ్గు నుండి ఉపశమనం పొందండి

మీరు జలుబు, దగ్గుతో బాధపడుతుంటే ఈ పొడిని మీరు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. దీని కోసం మీకు కొన్ని పదార్థాలు మాత్రమే అవసరం.

ఈ విధంగా పొడిని తయారు చేయండి

కావలసిన పదార్థాలు: చిన్న యాలకులు, లవంగాల పొడి.

తయారీ విధానం: ముందుగా యాలకులు, లవంగాలను తీసుకొని వాటిని లేతగా వేయించాలి.

వేయించిన తర్వాత వాటిని మెత్తగా పొడిగా తయారు చేయండి.

తయారైన పొడిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోండి.

దీనిని సేవించే విధానం

మీకు గొంతు నొప్పి, జలుబు లేదా దగ్గు వంటి సమస్యలు ఉంటే ఈ పొడిని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సేవించండి. కొద్ది రోజుల్లోనే మీకు దీని ప్రభావం కనిపించడం ప్రారంభమవుతుంది. ఇది దగ్గు, జలుబు నుండి ఉపశమనం ఇవ్వడమే కాకుండా మీ ఆరోగ్యాన్ని, జీర్ణ శక్తిని కూడా మెరుగుపరుస్తుంది.

Exit mobile version