Aids Vaccine : ఎయిడ్స్‌కు వ్యాక్సిన్ రెడీ.. తాజాగా కనుగొన్న ఇజ్రాయెల్ పరిశోధకులు

ఎయిడ్స్‌కు మందులేదు.నివార‌ణ ఒక్క‌టే మార్గం. ఇది ఇప్ప‌టిదాకా మ‌నం చెప్తూ వింటూ వ‌స్తున్న మాట‌

  • Written By:
  • Publish Date - July 14, 2022 / 11:00 AM IST

ఎయిడ్స్‌కు మందులేదు.నివార‌ణ ఒక్క‌టే మార్గం. ఇది ఇప్ప‌టిదాకా మ‌నం చెప్తూ వింటూ వ‌స్తున్న మాట‌. కానీ.. అలాంటి మ‌హ‌మ్మారిపై ఇజ్రాయెల్ పరిశోధకులు విజయం సాధించారట‌. జన్యు సవరణ ద్వారా హెచ్ఐవి-ఎయిడ్స్‌ను సమర్థంగా ఎదుర్కోగలిగే టీకాను అభివృద్ధి చేసినట్టు ఇజ్రాయెల్‌కు చెందిన టెల్ అవీవ్ వర్సిటీ పరిశోధకుల బృందం ప్రకటించింది. వైద్య రంగంలోనే ఇది అద్భుత‌మ‌ని నిపుణులు చెప్తున్నారు.

ఎయిడ్స్ ఎలా వ్యాపిస్తుంది?
హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (HIV) శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది. దీనికి సరైన చికిత్స కనుక తీసుకోకపోతే అది అక్వైర్డ్ ఇమ్యునో డిఫిషియెన్సీ సిండ్రోమ్ (AIDS)కి దారి తీస్తుంది. స‌రిగ్గా దీనిపైనే ప‌రిశోధ‌న‌లు చేసిన టెల్ అవీవ్ యూనివర్సిటీలోని ది జార్జ్ ఎస్ వైజ్ ఫ్యాకల్టీ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌లోని స్కూల్ ఆఫ్ న్యూరోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్ పరిశోధకుల బృందం టైప్- బి తెల్ల రక్త కణాల ద్వారా అభివృద్ధి చేసిన ఒకే టీకాతో వైరస్‌ను న్యూట్రలైజ్ చేయడంలో విజయం సాధించారు. హెఐవీని న్యూట్రలైజ్ చేసే ప్రతిరోధకాలను ఈ టీకా ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా రోగ నిరోధక వ్యవస్థను తిరిగి యాక్టివ్‌గా మారుస్తుంది.

పరిశోధనలో భాగంగా చికిత్స తీసుకున్న కొందరి రక్తంలో కావాల్సినన్ని యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయి. ఈ పరిశోధన విజయవంతం కావడంతో భవిష్యత్తులో ఎయిడ్స్‌కు మందులు కూడా ఉత్పత్తి చేస్తామని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు. తాము చికిత్స అందించిన అన్ని ల్యాబ్ మోడళ్లు బాగా ప్రతిస్పందించాయని, వారి రక్తంలో కావాల్సిన యాంటీబాడీని అధిక పరిణామంలో ఉత్పత్తి చేయగలిగామని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ బార్జెల్ వివరించారు.

ఎయిడ్స్ ఎప్పుడు గుర్తించారు?
సెంట్రల్ ఆఫ్రికాలోని ఒక రకమైన చింపాజీలో కనుగొన్న ఎయిడ్స్ వ్యాధి 1800వ సంవత్సరం చివర్లో మానవుల్లో కనిపించింది. ఎయిడ్స్‌పై ఎన్నోరకాల పరిశోధలు జరిగినప్పటికీ దీనికి శాశ్వతంగా చెక్‌చెప్పే ఔషధం ఇప్పటి వరకు రాలేదు.