Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదంలో తెలంగాణ

తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక మరియు ఢిల్లీలలో రొమ్ము క్యాన్సర్ బారీన పడే వారి సంఖ్య అధికంగా ఉన్నట్లు ఐసిఎంఆర్ వెల్లడించింది. భారతదేశంలో 2025 నాటికి ఈ ప్రభావం రెట్టింపు అయ్యే ప్రమాదం ఉన్నట్లు ఐసిఎంఆర్ అధ్యాయనం పేర్కొంది.

Breast Cancer: తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక మరియు ఢిల్లీలలో రొమ్ము క్యాన్సర్ బారీన పడే వారి సంఖ్య అధికంగా ఉన్నట్లు ఐసిఎంఆర్ వెల్లడించింది. భారతదేశంలో 2025 నాటికి ఈ ప్రభావం రెట్టింపు అయ్యే ప్రమాదం ఉన్నట్లు ఐసిఎంఆర్ అధ్యాయనం పేర్కొంది. 2012 నుంచి 2016 మధ్యకాలంలో రాష్ట్రాల వారీగా క్యాన్సర్ వ్యాప్తి ఏ విధంగా ఉందో వివరించింది.

తూర్పు మరియు ఈశాన్య ప్రాంతాలలో ఉన్న రాష్ట్రాల కంటే తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక మరియు ఢిల్లీలో రొమ్ము క్యాన్సర్ భారం ఎక్కువగా ఉంది. గ్రామీణ మహిళలకు కంటే పట్టణ మహిళల్లో ఈ ప్రమాదం అధికంగా ఉంది. మరియు మెట్రో ప్రాంతాలైన హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ అగ్రస్థానంలో ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది ఈ అధ్యయనం నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ (NCRP) కింద దేశవ్యాప్తంగా ఉన్న 28 జనాభా ఆధారిత క్యాన్సర్ రిజిస్ట్రీల నుండి డేటాను ఉపయోగించి 2016లో భారతదేశంలో స్త్రీల రొమ్ము క్యాన్సర్ ప్రభావంపై అధ్యాయనం జరిపింది ఐసిఎంఆర్.

2018లో గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ అధ్యయనం ప్రకారం, దక్షిణ-మధ్య ఆసియాలోని మహిళల్లో వయస్సు-ప్రామాణిక రొమ్ము క్యాన్సర్ ప్రభావం 1 లక్ష మంది మహిళలకు 25.9గా ఉంది.గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్ (GBD) అధ్యయనం ప్రకారం 2016లో దక్షిణ-మధ్య ఆసియాలో వయస్సు-ప్రామాణిక రొమ్ము క్యాన్సర్ రేటు లక్ష మంది మహిళలకు 21.6గా ఉంది.

జీవనశైలి, అధిక ఊబకాయం, వివాహం మరియు ప్రసవం ఆలస్యం మరియు తల్లిపాల లేమి వంటి ద్వారా పట్టణ ప్రాంతాల్లో రొమ్ము క్యాన్సర్ సమస్యలు తలెత్తుతున్నాయి.

Also Read: April 1st – Railway Tickets : ఏప్రిల్‌ 1 విడుదల.. రైల్వే టికెట్ కౌంటర్లలో డిజిటల్ పేమెంట్స్