హైబీపీ (High Blood Pressure) అంటే అధిక రక్తపోటు. ఇది గుండె, కిడ్నీ వంటి ముఖ్యమైన అవయవాలకు దెబ్బతీయవచ్చు. అధిక రక్తపోటు ఉన్నవారు జీవనశైలిలో మార్పులు చేయడమే కాదు, ఆహారపు అలవాట్లలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యులు హైబీపీ రోగులకు కొన్ని ముఖ్యమైన ఆహార నియమాలు సూచిస్తున్నారు.
హైబీపీ ఉన్నవారు ఎక్కువ ఉప్పు ఉన్న ఆహారం తినకూడదు. రోజుకు 2 గ్రాముల ఉప్పు మాత్రమే తినాలని వైద్యులు సూచిస్తున్నారు. పచ్చళ్లు, ఉప్పు ఎక్కువగా ఉండే ప్యాకేజ్డ్ ఫుడ్ పూర్తిగా మానేయాలి. ఇంట్లో తాజా ఆహారాన్ని తయారు చేసి తినడమే ఉత్తమం. అలాగే బేక్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, డిజర్ట్స్, ఐస్ క్రీమ్ వంటి ఆహారాలు హైబీపీ ఉన్నవారికి ప్రమాదకరం. వీటిలో ఎక్కువ నూనె, చక్కెర, ఉప్పు ఉంటాయి. వీటి స్థానంలో ఆరోగ్యకరమైన ఆహారం, నేరుగా తినదగిన నట్స్, పండ్లను తీసుకోవడం మంచిది.
Chandrababu : చంద్రబాబు ఒక కర్మయోగి – సచ్చిదానందస్వామి
హైబీపీ ఉన్నవారు మద్యం పూర్తిగా మానేయాలి. మద్యం వల్ల రక్తపోటు మరింత పెరుగుతుంది. అలాగే, కాఫీ కూడా తగ్గించుకోవడం మంచిది. దీని వల్ల నాడీ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. తేలికపాటి హర్బల్ టీలు లేదా గ్రీన్ టీ తాగడం మంచిది. ఆహార నియమాలు పాటించడంతో పాటు హైబీపీ ఉన్నవారు వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలి. ప్రతి రోజు 30 నిమిషాలు నడక లేదా యోగా చేయడం హైబీపీ నియంత్రణలో సహాయపడుతుంది. ఆహారం, వ్యాయామం, జీవనశైలిలో మార్పులతో హైబీపీ సమస్యను తగ్గించుకోవచ్చని డాక్టర్స్ తెలుపుతున్నారు.