Ghee Pure Or Fake: తిరుపతి దేవస్థానం ప్రసాదంలో తయారు చేసే లడ్డూలలో కల్తీ నెయ్యి వాడినట్లు నిర్ధారణ అయింది. ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు, చేపనూనె కలిసినట్లు కూడా నివేదికలు వచ్చాయి. అయితే మీ ఇంట్లో కూడా వాడే నెయ్యి కల్తీదా లేక కల్తీ లేని నెయ్యి (Ghee Pure Or Fake) వాడుతున్నట్లు తెలుసుకోవటం ఎలా అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు ఈ ఆర్టికల్‌లో మీరు స్వచ్ఛమైన, కల్తీ నెయ్యిని వెంటనే గుర్తించే కొన్ని పద్ధతుల గురించి మీకు చెప్పబోతున్నాం.
ఉప్పు పరీక్ష
స్వచ్ఛమైన నెయ్యిని పరీక్షించడానికి ఉప్పు సులభమైన మార్గం. ఒక పాత్రలో 2 టీస్పూన్ల నెయ్యి తీసుకుని దానికి రెండు టీస్పూన్ల ఉప్పు, రెండు చుక్కల హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలపండి. ఇప్పుడు 20 నిమిషాల తర్వాత తనిఖీ చేయండి. అప్పుడు నెయ్యి రంగు ఎరుపులోకి మారితే మీ నెయ్యి కల్తీ అయినట్లు భావించాలి.
Also Read: Junior NTR Reaction: దేవర ఈవెంట్ రద్దుపై జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన.. వీడియో వైరల్..!
నీరు
ఒక గ్లాసు నీళ్లలో ఒక చెంచా నెయ్యి వేస్తే అది స్వచ్ఛంగా ఉంటుంది. కానీ నెయ్యి నీటిలో మునిగితే అది కల్తీ నెయ్యి అన్నట్లు మనం అర్థం చేసుకోవాలి.
అరచేతిపై రుద్దడం ద్వారా
అరచేతుల మధ్య నెయ్యి ఉంచి ఆపై రెండు అరచేతులను కలిపి కనీసం 10 నిమిషాల పాటు రుద్దండి. ఆపై అరచేతులను వాసన చూడండి. నెయ్యి వాసన ఉంటే అది నిజమైనది అని, వాసన రాకుంటే అది కల్తీ నెయ్యి అని మనం భావించాలి.
కల్తీ నెయ్యి ఎలా తయారవుతుంది
కల్తీ నెయ్యిని తయారు చేయడానికి వెజిటబుల్ ఆయిల్, కరిగించిన వెన్న, డాల్డా, హైడ్రోజనేటెడ్ ఆయిల్‌ను ఉపయోగిస్తారు. ఇలాంటి నెయ్యి వాడటం వలన ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే అసలైన నెయ్యి బంగారు వర్ణంలో ఉంటుంది. గడ్డ కడితే తెలుపు వర్ణంలో ఉంటుంది. అంతేకాకుండా స్వచ్ఛమైన నెయ్యిని గుర్తించటం ఎలానో నిపుణులు చెబుతున్నారు. స్వచ్ఛమైన దేశీ నెయ్యి రంగు పసుపు లేదా.. బంగారు వర్ణంలో ఉంటుందని చెబుతున్నారు. గడ్డకట్టిన నెయ్యి తెలుపు రంగులో ఉంటుందని, దానిని వేడి చేసినప్పుడు బంగారు రంగులో కనపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.