సాధారణంగా గుండె సమస్యలు మగవారికే ఎక్కువగా వస్తాయని అనుకుంటారు. కానీ మెనోపాజ్ తరువాత ఆడవారిలో కూడా గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. వాస్తవంగా ఆడవారికి గుండె జబ్బులు వస్తే అవి మగవారిలో కనిపించే లక్షణాల కంటే భిన్నంగా ఉంటాయి. దీనివల్ల సరైన నిదానంగా చికిత్స అందుకునే అవకాశం తగ్గిపోతుంది. ప్రాథమిక లక్షణాలను గుర్తించకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది.
ఆడవారిలో గుండె సమస్యల ప్రత్యేకత
మగవారిలో గుండె సంబంధిత సమస్యలు తక్షణమే తీవ్రంగా కనిపించగా, ఆడవారిలో సైలెంట్ హార్ట్ ప్రాబ్లమ్ వస్తుంది. ఇది ముందుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధిక అలసట, మితిమీరిన చెమట, శరీర ఉబ్బరం వంటి లక్షణాలతో మొదలవుతుంది. చాలా మంది వీటిని సాధారణ అనారోగ్య సమస్యలుగా తీసుకుంటారు. దీని వల్ల చికిత్స ఆలస్యమవుతుంది. గర్భధారణ కాలంలో హైబీపీ, గెస్టేషనల్ డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నా, మెనోపాజ్ తరువాత హార్మోనల్ మార్పులు వచ్చినా గుండె సంబంధిత వ్యాధుల అవకాశాలు పెరుగుతాయి.
గుండె ఆరోగ్యానికి ప్రమాదకరమైన కారణాలు
మగవారిలాగే ఊబకాయం, హైబీపీ, కొలెస్ట్రాల్ పెరుగుదల వంటివి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అయితే, ఆడవారిలో స్మోకింగ్, ఒత్తిడి, డిప్రెషన్, వ్యాయామం తక్కువగా చేయడం వంటి కారణాలు మగవారికంటే అధిక ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా బ్లడ్ షుగర్ ఉన్న ఆడవారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే, కుటుంబంలో గుండె సంబంధిత వ్యాధుల చరిత్ర ఉన్నా, గర్భధారణ సమయంలో హైబీపీ, షుగర్ వచ్చినా గుండె సమస్యలు త్వరగా ఏర్పడతాయి.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి పోషకాహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించాలి. స్మోకింగ్, ఆల్కహాల్ తగ్గించుకోవాలి. హోల్ గ్రెయిన్స్, పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులు, లీన్ ప్రోటీన్స్ తీసుకోవడం మంచిది. ఉప్పు, చక్కెర, అధిక కొవ్వు ఆహారాన్ని తగ్గించాలి. నిత్య వ్యాయామం చేయాలి, సరిగ్గా నిద్రపోవాలి (రోజుకు 7-9 గంటలు). అలాగే ఒత్తిడిని తగ్గించుకోవడానికి మెడిటేషన్, యోగా లాంటివి చేయడం మంచిది. రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలను నిరంతరం చెక్ చేసుకుంటూ సరైన మెడికేషన్ తీసుకుంటే, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
Telangana BJP Chief : తెలంగాణ బీజేపీ చీఫ్‌గా ఈటల రాజేందర్..అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్