Site icon HashtagU Telugu

Health Tip : ఈ రకమైన అల్పాహారం గుండె ఆరోగ్యానికి ఉత్తమం..!

Multigrain

Multigrain

Health Tip : ఇప్పటి జీవనశైలిలో అనేక మార్పులు వస్తున్న నేపథ్యంలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా మన హృదయ ఆరోగ్యం పై ఇది ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తోంది. అందుకే మన హార్ట్‌ను ఆరోగ్యంగా ఉంచేందుకు కొన్ని అలవాట్లు ఏర్పరుచుకోవాలి. వ్యాయామంతో పాటు, మన రోజువారీ ఆహారపట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉదయం తినే బ్రేక్‌ఫాస్ట్ ఆరోగ్యకరంగా ఉంటే, అది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ నేపథ్యంలో హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచే కొన్ని ఉత్తమమైన అల్పాహార ఎంపికలు ఇక్కడ ఉన్నాయి — ఇవి పిల్లలకు కూడా తినిపించవచ్చు.

మొలకెత్తిన ధాన్యాలు (Sprouts)

కొంతమందికి ఇవి బ్రేక్‌ఫాస్ట్‌గా సరిపోతాయా అనే అనుమానం ఉండొచ్చు. కానీ మొలకలు పోషకాలతో నిండినవి. ఇవి హృదయానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి హార్ట్ హెల్త్‌ను మెరుగుపరుస్తాయి. ప్రతిరోజూ కొద్దిగా మొలకలు తీసుకోవచ్చు.

ఓట్స్ ఉప్మా లేదా ఓట్స్ ఇడ్లీ

హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచాలంటే ఓట్స్‌ను అల్పాహారంలో చేర్చాలి. ఫైబర్ అధికంగా ఉండే ఓట్స్ వలన కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. ఇవి ఉప్మా, ఇడ్లీ లేదా పండ్లతో కలిపి తినొచ్చు. రుచికరంగా ఉండటంతోపాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

పెరుగు -పండ్లు

గట్టి పెరుగు పండ్లతో కలిపి తినడం వల్ల కడుపు నిండుతుంది, శక్తి లభిస్తుంది. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందించడంతోపాటు, హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులో కొవ్వు తక్కువగా ఉండడం, యాంటీఆక్సిడెంట్లు ఉండడం వీటి ప్రత్యేకత.

ఎగ్ వైట్ ఆమ్లెట్

మొట్కులోని తెల్ల భాగం ప్రోటీన్‌తో నిండిఉంటుంది. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. అయితే ఉదయాన్నే మొట్కును తినాలనుకుంటే, పసుపు భాగాన్ని తీసేసి తెల్ల భాగాన్ని మాత్రమే తీసుకోవడం ఉత్తమం.

మల్టీ గ్రేన్ ఇడ్లీ

ఇడ్లీని రుచిగా, ఆరోగ్యంగా తయారుచేయాలంటే అందులో రవ్వ, ఉలవలు మాత్రమే కాదు – జొన్నలు, ఓట్స్, గోధుమ పిండి వంటి పదార్థాలను కూడా కలపవచ్చు. కావాలంటే చిటికెడు కూరగాయల ముక్కలు కలిపి మరింత ఆరోగ్యంగా తయారుచేయవచ్చు.

ఆరోగ్యకరమైన అల్పాహారం ఎంచుకోవడం ద్వారా మన హృదయాన్ని రక్షించుకోవచ్చు. ఈ ఎంపికలు తేలికగా తయారవుతాయి, రుచికరంగా ఉంటాయి, ఆరోగ్యానికి హానికరం కావు. ఇవి పిల్లలకూ, పెద్దలకూ ఒక మంచి ఆరంభం కావొచ్చు.

Acidity Problem : కడుపు ఉబ్బరంగా ఉంటుందా..? అయితే ఈ పండు తినండి