Site icon HashtagU Telugu

Health Tips: కిడ్నీ ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోండి ఇలా?

Health Tips

Health Tips

Health Tips: కిడ్నీ ఆరోగ్యంగా (Health Tips) ఉండటం చాలా ముఖ్యం. అలాగే మీ కిడ్నీ సరిగ్గా పనిచేస్తోందా లేదా అని తెలుసుకోవడం కూడా మీకు తెలిసి ఉండాలి. న్యూరాలజిస్ట్ వైద్యుల ప్రకారం.. ఒక సులభమైన పద్ధతి ద్వారా మీరు స్వయంగా మీ కిడ్నీ ఆరోగ్యంగా ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. వైద్య‌లు సూచ‌న ప్ర‌కారం.. RFT టెస్ట్ లేదా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ లేకుండా కిడ్నీ ఆరోగ్యాన్ని పరీక్షించే విధానం గురించి వివరించారు. వైద్యులు ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం!

కిడ్నీ సరిగ్గా పనిచేస్తోందా లేదా?

వైద్యులు ప్ర‌కారం.. కిడ్నీ ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి అత్యంత సులభమైన మార్గం ‘మూత్రం’. “సాధారణంగా, ఒక వ్యక్తి మూత్రం గంటకు కిలోగ్రాముకు 0.5 నుండి 1 మిల్లీలీటర్ ఉంటుంది. అంటే 0.5-1 మిల్లీ/కిగ్రా/గంట. ఉదాహరణకు 50 కిలోగ్రాముల బరువు ఉన్న వ్యక్తి మూత్రం దాదాపు 50 మిల్లీలీటర్లు ఉండాలి. ఇది వారి కిడ్నీ పూర్తిగా పనిచేస్తోందని సూచిస్తుంది” అని పేర్కొన్నారు.

Also Read: Pahalgam Attack: పాక్‌కు మ‌రో ఎదురుదెబ్బ‌.. ఈసారి ఇంట‌ర్నేష‌న‌ల్ లెవ‌ల్‌లో!

మూత్రం పరీక్ష ఎలా చేయాలి?

వైద్యుల ప్రకారం.. కనీసం 10 గంటల మూత్రాన్ని పరీక్షించాలని సూచించారు. ఆ ప్రకారం 50 కిలోల బరువు ఉన్న వ్యక్తి మూత్ర ఉత్పత్తి దాదాపు 500 మిల్లీలీటర్లు ఉంటుంది. ఆయన ఒక లీటరు బిస్లెరీ బాటిల్ తీసుకుని పరీక్షించమని సూచిస్తున్నారు. మీకు సరిగ్గా మూత్రం వస్తుంటే అది మీ కిడ్నీ పూర్తిగా ఆరోగ్యంగా ఉందని సూచిస్తుంది. ఈ సులభమైన పరీక్ష ద్వారా మీ కిడ్నీ ఎంత బాగా పనిచేస్తోందో తెలుసుకోవచ్చు.

వైద్యుల సూచనలు

కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కోసం కేవలం మూత్ర ఉత్పత్తి (యూరిన్ ఔట్‌పుట్) చూడటం సరిపోతుందని చెప్పారు. ఈ పరీక్ష పెద్ద ఆసుపత్రుల్లో లేదా తీవ్రమైన పరిస్థితుల్లో ఉదాహరణకు సెప్సిస్, షాక్, లేదా రోగి ఐసీయూలో చేరినప్పుడు చేయబడుతుంది. అప్పుడు డాక్టర్లు మొదట మూత్ర ఉత్పత్తిని పరీక్షిస్తారు. కిడ్నీ ఎలా పనిచేస్తోందో పూర్తిగా అంచనా వేస్తారు.