Site icon HashtagU Telugu

Health Tips: పాల‌తో ఈ ప‌దార్థాల‌ను క‌లిపి తీసుకుంటే డేంజ‌ర్‌!

Health Tips

Health Tips

Health Tips: ప్రస్తుతం చాలామంది పాలు తాగుతున్నప్పుడు అందులో డ్రై ఫ్రూట్స్, పండ్లు లేదా ప్రోటీన్ పౌడర్ కలుపుకుంటున్నారు. కొందరు అచ్చం పాలు తాగడానికి ఇష్టపడరు. అయితే పాలతో కలిపి ఏ ఒక్క పదార్థాన్ని కూడా తీసుకోకూడదో మీకు తెలుసా? దీని గురించి ఆయుర్వేద నిపుణులు (Health Tips) ఏమంటున్నారో తెలుసుకుందాం!

పాల‌తో ఈ ప‌దార్థాల‌ను క‌లిపి తీసుకోవద్దు

ప్రకారం, పాలతో పండ్లను కలిపి తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం. చాలా మంది మామిడి షేక్, అరటి షేక్ వంటివి తాగుతుంటారు. కానీ పాలు, పండ్లను కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆరోగ్య నిపుణులు అన్నారు. వీటిని ఒకేసారి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. అయితే పాలతో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. ఇది శరీరానికి సరైన పోషణ అందించి, శక్తిని పెంచుతుంది.

Also Read: Ministry Of Finance Employee: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి దుర్మ‌రణం..!

పాలు, పండ్లు కలిపి ఎందుకు హానికరం?

ఆయుర్వేదం ప్రకారం.. పాలు, పండ్ల స్వభావాలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. పాలు చల్లగా, బరువుగా ఉంటాయి. అయితే పండ్లు తేలికగా, వేడిగా ఉంటాయి. వీటిని ఒకేసారి కలిపి తీసుకున్నప్పుడు శరీరంలో ‘అమ’ (జీర్ణం కాని విష పదార్థాలు) ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల అసిడిటీ, అజీర్ణం, చర్మ వ్యాధులు వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అరటిపండు, నారింజ, స్ట్రాబెర్రీ, కివీ వంటి పండ్లు పాలతో కలిసినప్పుడు జీర్ణక్రియను మరింత దెబ్బతీస్తాయి.

పాలకు ప్రత్యామ్నాయాలు

అయితే పాలను మరింత పోషకమైనదిగా చేసుకోవాలనుకుంటే పండ్లకు బదులుగా డ్రై ఫ్రూట్స్‌ను ఉపయోగించవచ్చు. బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ పాలతో కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి శరీరాన్ని బలోపేతం చేసి, శక్తిని పెంచుతాయి.