Site icon HashtagU Telugu

Kasuri Methi : కసూరి మేతి.. కొలెస్ట్రాల్‌, అపానవాయువు ప్రాబ్లమ్స్‌కు చెక్

Kasuri Methi

Kasuri Methi

Kasuri Methi : కసూరి మేతి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎముకలను దృఢంగా చేస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. అపానవాయువు, ఉబ్బరం, మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యలను ఇది తగ్గిస్తుంది. కసూరి మేతిలో ఉండే యాంటీ ఫ్లాటులెంట్ లక్షణాలు, ఫైబర్ వల్ల మన కడుపులోని అలిమెంటరీ కెనాల్‌లో గ్యాస్ ఏర్పడటం తగ్గుతుంది. కసూరి మెంతులు(Kasuri Methi) జుట్టు, చర్మానికి కూడా మేలు చేస్తాయి. చర్మంలో కొత్త కణాలు ఏర్పడటానికి సహాయపడుతాయి. దీన్ని తీసుకోవడం వల్ల చర్మం చాలా కాలం పాటు మెరుస్తూ, యవ్వనంగా ఉంటుంది. ఇందులో ఉండే ఐరన్, విటమిన్లు కూడా జుట్టుకు ప్రయోజనాలను అందిస్తాయి. జుట్టు త్వరగా తెల్లగా మారదు. జుట్టు పెరుగుదల కూడా కంటిన్యూ అవుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

కసూరి మేతి సూక్ష్మపోషకాల గొప్ప మూలం. ఇందులో క్యాల్షియం, ఫైబర్, ప్రొటీన్, ఐరన్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి.  ఇది చాలా తక్కువ కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. కసూరి మెంతికూరలో అసహజమైన అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది ప్యాంక్రియాటిక్ ఐలెట్ కణాలలో గ్లూకోజ్ ప్రేరిత ఇన్సులిన్ విడుదలను పెంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉంటే కసూరి మేతిని తినొచ్చు.  ఇది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండెలో రక్తం గడ్డకట్టే సమస్యను నివారిస్తుంది. కసూరి మేతిని రోజువారీ తీసుకోవడం వల్ల రక్తంలో లిపిడ్ స్థాయిలపై సానుకూల ప్రభావం ఉంటుంది. లిపిడ్లు హెచ్చుతగ్గులకు లోనవుతున్న వారు ఈ హెర్బ్ నుంచి చాలా ప్రయోజనం పొందొచ్చు. యాంటీ ఆక్సిడెంట్‌గా ఉండటం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తుంది.

Also Read : World War III : మూడో ప్రపంచ యుద్ధం.. ఛాట్ జీపీటీ భయంకర జోస్యం

కసూరి మెంతికూర అధిక బరువును సైతం తగ్గిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల మెనోపాజ్‌కు సంబంధించిన అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. ఈ ఆకులు స్త్రీ శరీరంలోని హార్మోన్ల దుష్ప్రభావాలను నియంత్రించడానికి ఈస్ట్రోజెన్ చర్యలను సరిచేస్తాయి. మెంతి ఆకులను ఎండబెట్టి తయారుచేసే కసూరి మేతిని మీ రెగ్యులర్ డైట్‌లో చేర్చుకుంటే మెనోపాజ్ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. కసూరి మేతిని వినియోగించడం వల్ల కొన్ని వంటకాల్లో అద్భుతమైన టేస్ట్ సైతం వస్తుందని పోషకాహార నిపుణులు చెబుతుంటారు.

Also Read : Mayawati: భారత కూటమిలోకి మాయావతి ?