Exercises for Men: మగాళ్లు అందంగా ఉండాలంటే ఈ మూడు ఎక్సర్ సైజులు చేయాల్సిందే.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి?

ప్రస్తుత కాలంలో ఆడవారు మగవారు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా అందం,ఆరోగ్యం, ఫిట్నెస్ పై అనేక రకాల

  • Written By:
  • Publish Date - November 13, 2022 / 06:30 AM IST

ప్రస్తుత కాలంలో ఆడవారు మగవారు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా అందం,ఆరోగ్యం, ఫిట్నెస్ పై అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మగాళ్ళు అయితే ఫిట్నెస్ కు తగ్గట్టుగా అందంగా ఉండాలి అనుకుంటూ ఉంటారు. అయితే ఎక్సర్సైజ్ చేయడం వల్ల చర్మం వెంట్రుకలు కాపాడుకోవచ్చు అన్న విషయం చాలామందికి తెలియదు. ఫిట్నెస్ విషయంలో ఏ విధంగా అయితే వ్యాయామాలు ఉన్నాయో అదేవిధంగా జుట్టు, చర్మ సంరక్షణ కోసం కూడా ప్రత్యేకమైన వ్యాయామాలు ఉన్నాయి.

అయితే మనం రోజు చేసే వ్యాయామాలతో పాటుగా బెల్లిఫ్యాట్, పొట్ట తగ్గించుకోవడంతో పాటు చర్మం జుట్టును సంరక్షించుకోవచ్చు. అయితే మూడు రకాల ఎక్సర్​సైజ్ లు చేయడం వల్ల అవి మీ అందాన్ని పెంచడంతోపాటు ఫిట్నెస్ గా ఉంచుతాయి. అవి స్క్వాట్స్​, డెడ్​ లిఫ్ట్​లు, చెస్ట్ ప్రెస్​. మరి ఈ మూడు ఎక్సర్​సైజ్ లు ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వ్యాయామంలో స్క్వాట్స్ చాలా కీలకమైనది. ఈ వ్యాయామంలో ఒక చోట నిల్చొని, పాదాలు, మోకాళ్లు ఆధారంగా కుర్చీలో వెనుకకు కూర్చున్నట్టు బెండ్ అవుతూ లేవడాన్ని స్క్వాట్స్ అంటారు.

ఇలా వెంటవెంటనే ఈ వ్యాయామాన్ని చేయాలి. ప్రారంభంలో స్టాండర్డ్​ స్క్వాట్ చేయాలి. డె​డ్​లిఫ్ట్​ కూడా వెయిట్ లిఫ్టింగ్ లాగే ఉంటుంది. అందుకోసం రాడ్​కు డార్​బెల్స్, బార్స్ లోడ్ చేసిన దాన్ని ఎత్తడమే డెడ్​లిఫ్ట్​. నేలపై ఉన్న ఈ బరువును చేతులపై ఎత్తాలి. అలాగే ఇందులో బరువు పెంచాలనుకుంటే బార్స్​ వెయిట్ పెంచితే సరిపోతుంది. చెస్ట్ పై ఒత్తిడి కలిగే విధంగా చేసే ఎక్సర్​సైజ్​లను చెస్ట్ ప్రెస్​ అంటారు. జిమ్​లోని వివిధ పరికరాలతో ఈ చెస్ట్ ప్రెస్​ వ్యాయామాలు చేయవచ్చు. వీపు భాగంలో ఆధారం ఉంచుకొని ఈ చెస్ట్ ప్రెస్​ ఎక్సర్​సైజ్​లు చేయాలి. కేబుల్​, డంబుల్స్​ సాయంతో కూడా ఇవి చేయవచ్చు.