వట్టివేర్లు.. గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. వీటినే ఖుస్ అని అంటారు. ఇవి ఒక రకమైన సువాసన వచ్చే పొడవైన గడ్డి మొక్క వేర్లు. సంప్రదాయ పద్ధతుల్లో ఈ గడ్డి మొక్క వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మొక్క కంటే వేర్ల వల్ల ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మనలో చాలా తక్కువ మందికి మాత్రమే ఈ వేర్లు గొప్పవనీ, మంచివనీ తెలుసు. కానీ వీటిని ఎలా వాడాలో సరిగా తెలియదు. అదెలాగో తెలిస్తే కచ్చితంగా వీటిని కొంటారు. ఇదేమీ పెద్ద సీక్రెట్ కాదు. ఒక మట్టి కుండలో తాగు నీరు పోసి అందులో వట్టి వేర్లను వెయ్యాలి.
We’re now on WhatsApp. Click to Join
వేర్లు నీటిలో పూర్తిగా మునగాలి. ఇలా కొన్ని గంటలు ఉంచాలి. ఆ తర్వాత నీటిని వడగట్టి ఆ నీటిని తాగితే చాలు. వట్టి వేర్లు నీటిని చల్లబరుస్తాయి. అంతేకాదు శరీరంలో వేడిని తగ్గిస్తాయి. చలవ చేస్తాయి. ఇవి సహజసిద్ధంగా విష వ్యర్థాలు, విష సూక్ష్మక్రిములతో పోరాడతాయి. శరీరంలో వేడిని తగ్గించడమే కాదు బాడీకి ఉపశమనం కలిగిస్తాయి. మానసికంగా కూడా హాయిగా ఉంటుంది. బ్రెయిన్ కణాలు చల్లగా అవుతాయి. కోపం, ఆవేశం తగ్గేందుకు ఈ వేర్లు కొంత వరకూ సహాయపడతాయి.
Also Read: Green Banana: అరటిపండు, అరటికాయ ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
వట్టి వేర్ల నుంచీ వచ్చే తైలం కూడా చాలా మంచిది. ఇది విడిగా మార్కెట్లలో దొరుకుతుంది. లేదా, ఈ కామర్స్ సైట్లలో లభిస్తాయి. 50 గ్రాముల వేర్లు రూ.80 దాకా ఉంటాయి. ఇందులో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి. ఈ ఆయిల్‌ని చర్మం, జుట్టుకి వాడినప్పుడు ఇది మొత్తం క్లీన్ చేస్తుంది. నురగలా వచ్చి శుభ్రపడుతుంది. మనం వాడేసిన వట్టి వేర్లను పారేయడం కామన్. అయితే కొన్ని కంపెనీలు ఈ వేర్లను మ్యాట్స్ లేదా పరుపుల తయారీకి వాడుతున్నాయి. ఈ పరుపులపై పడుకుంటే చల్లగా మనస్శాంతిగా ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి.
Also Read: Apple vs Guava: ఏ పండు ఎక్కువ ఆరోగ్యకరం.. జామకాయ? యాపిలా?