Site icon HashtagU Telugu

Mint Leaves : పుదీనా తినండి.. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

Health Benefits of Mint Leaves must eat or use in food

Health Benefits of Mint Leaves must eat or use in food

ఆకుకూరగా దొరికే వాటిల్లో పుదీనా ఒకటి. పుదీనా(Mint Leaves)తో మనం పచ్చడి చేసుకుంటాము, పలు వంటల్లో గార్నిష్ గా కూడా వేస్తాము. ఇటీవల పలు డ్రింక్స్(Drinks)లో, కొత్త రకం వంటల్లో(Food) కూడా పుదీనాను వాడుతున్నారు. పుదీనాలో అన్ని రకాల పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. పుదీనా ఆకుల్లో విటమిన్ ఎ, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ b1, విటమిన్ b2 , విటమిన్ b3 , విటమిన్ c , ఐరన్, భాస్వరం, ఫైబర్, యాంటి ఆక్సిడెంట్లు వంటివి అధికంగా ఉన్నాయి. పుదీనా ఆకుల్లో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్, తక్కువ మొత్తంలో కొవ్వులు ఉంటాయి. సుమారు 25 గ్రాముల పుదీనా ఆకుల్లో నాలుగు క్యాలరీలు మాత్రమే ఉంటాయి.

పుదీనా తినడం వలన కలిగే ప్రయోజనాలు..

* పుదీనా ఆకుల్లో ఉండే విటమిన్ ఎ మన కంటిచూపును మెరుగుపరుస్తుంది.
* పుదీనా ఆకులు తినడం వలన అది మన శరీరంలో మలబద్దకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
* పుదీనా ఆకులు తినడం వలన అవి మన శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది.
* రోజూ ఉదయమే పుదీనా వాటర్ తాగితే అది మనల్ని రోజంతా ఎనర్జిటిక్ గా ఉండేలా చేస్తుంది.
* పుదీనా ఆకులు మన శరీరాన్ని ఆక్సీకరణం నుండి రక్షిస్తాయి.
* పుదీనా ఆకుల్లో ఉండే ఫైబర్ మన శరీరంలోని రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి ఊబకాయం రాకుండా ఉండేలా చేస్తుంది.
* పుదీనా ఆకుల్లో ఉండే మెంతోల్ ఎసెన్స్ గొంతునొప్పిని నివారించడానికి సహాయపడుతుంది.
* రాత్రి పూట పడుకునే ముందు రోజూ పుదీనా టీ లేదా పుదీనా వాటర్ తాగితే మనకు మంచి నిద్ర పడుతుంది.
* పుదీనా ఆకుల్లో ఉండే విటమిన్ సి మన శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
* పుదీనా ఆకులు తినడం వలన మన మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది.

 

Also Read : Carrot : క్యారెట్ వర్సెస్ క్యారెట్ జ్యూస్.. ఏది మంచిది?