పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పాలు పాల పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలలో క్యాల్షియం పుష్కలంగా లభిస్తుంది. అందుకే చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరు టీ కాఫీ లకు బదులుగా పాలు తాగాలని వైద్యులు చెబుతూ ఉంటారు. ఇందులో ఉండే విటమిన్ డి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయట. రోజూ పాలు తాగడం వల్ల మీ ఎముకలు, కీళ్ళు బలంగా,దృఢంగా ఉంటాయని చెబుతున్నారు.
అలాగే పాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలు తాగడం రక్తంలో చక్కెర స్థాయిలను తక్కువగా లేదా సమానంగా ఉంచడంలో సహాయపడుతుందట. రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయట. పాలు గుండె ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయట. పాల ఉత్పత్తులు స్ట్రోక్, గుండె జబ్బులు,అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయట. పాల ఉత్పత్తులు వాటి అధిక సంతృప్త కొవ్వు పదార్ధాల కారణంగా స్ట్రోక్ ప్రమాదాన్ని ఎక్కువగా కలిగి ఉంటాయని చెబుతున్నారు.
పాలు కొన్ని క్యాన్సర్ ల ప్రమాదాన్ని తగ్గిస్తాయట. అధిక పాలు తీసుకోవడం వల్ల పెద్దప్రేగు, మల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని, ఎందుకంటే కాల్షియం రసాయన లక్షణాలను కలిగి ఉంటుందని చెబుతున్నారు. మీరు బరువు తగ్గించే ప్రయాణంలో ఉన్నప్పటికీ, పాలు క్రమం తప్పకుండా తీసుకోవడం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుందట. కాగా పాలలో ఉండే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వుల కలయిక వల్లనే ఇలా జరుగుతుందని, దీని వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుందని చెబుతున్నారు. కాబట్టి పాలు తాగడం ఎంతో మంచిది. ముఖ్యంగా వయసు మీద పడిన వారు కీళ్ల నొప్పులు సమస్యలు ఉన్నవారు పాలు తాగడం వల్ల ఉండవు అని చెబుతున్నారు.