Egg yolk : గుడ్డులో పచ్చసొన తినడం లేదా ? ఈ విషయాలు తెలుసుకోండి

గుడ్డు పచ్చసొనలో కొవ్వు ఉన్నా.. దీనివల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదంటున్నారు. పూర్తి గుడ్డును తింటేనే అందులోని సంపూర్ణపోషకాలు అందుతాయని చెబుతున్నారు.

  • Written By:
  • Publish Date - November 4, 2023 / 09:04 PM IST

Egg yolk : ప్రొటీన్.. ఇది ఆరోగ్యంగా ఉండేందుకు చాలా ముఖ్యమైన పోషకం. ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో కోడిగుడ్లు కూడా ఒకటి. ప్రతిరోజూ గుడ్డును తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే చాలా మంది గుడ్డులో తెల్లసొనను మాత్రమే ఆహారంగా తీసుకుని, పచ్చసొనను తినడం మానేస్తున్నారు. అందుకు కారణం పచ్చసొనలో కొవ్వు ఎక్కువగా ఉంటుందన్న అపోహే. కోడిగుడ్డులో తెల్లసొనతో పాటు పచ్చసొన కూడా తినాలని సూచిస్తున్నారు నిపుణులు.

గుడ్డు పచ్చసొనలో కొవ్వు ఉన్నా.. దీనివల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదంటున్నారు. పూర్తి గుడ్డును తింటేనే అందులోని సంపూర్ణపోషకాలు అందుతాయని చెబుతున్నారు. పచ్చసొనలోనూ విలువైన పోషకాలుంటాయని వాటి వల్ల చాలా మేలు కలుగుతుందని సూచిస్తున్నారు.

కోడిగుడ్డు తెల్లసొనలో కంటే పచ్చసొనలో పోషకాలు అధికంగా ఉంటాయి. పచ్చసొనలో విటమిన్ ఎ,డి,ఇ,కె,బి6, బి12, క్యాల్షియం, జింక్, రైబోప్లేవిన్, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్, పొటాషియం వంటి ఎన్నో పోషకాలుంటాయి. కంటిచూపు మెరుగవుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. పిల్లల్లో ఎదుగుదల త్వరగా ఉంటుంది. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి.

కోడిగుడ్డు పచ్చసొనలో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీలకు చాలా అవసరం. గర్భిణులు ప్రతిరోజూ కోడిగుడ్డును పూర్తిగా తినాలని గైనకాలజిస్టులు సూచిస్తున్నారు. కాగా.. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు మాత్రం పచ్చసొనను తినకపోవడమే మంచిదని చెబుతున్నారు.

Also Read : Diabetes Diet: మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ పండ్లు తినాలో.. ఏ పండ్లు తినకూడదో తెలుసా..?