Site icon HashtagU Telugu

Sprouted Moong : మొలకెత్తిన పెసలు తింటే.. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా??

Health Benefits of Eating Sprouted Green Moong

Health Benefits of Eating Sprouted Green Moong

మొలకెత్తిన గింజలు(Sprouts) తింటే మన ఆరోగ్యానికి మంచిది అని మన అందరికీ తెలుసు. అయితే వాటిలో పెసలు(Green Moong) మొలకెత్తినవి తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి చాలా మంది మొలకెత్తిన పెసలను(Sprouted Green Moong) ఉదయం పూట టిఫిన్ టైంలో తింటున్నారు. మొలకెత్తిన పెసల్లో ఫైబర్, రౌగేజ్, విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, అనేక ఖనిజాలు కూడా ఉన్నాయి.

* మొలకెత్తిన పెసలలో ఉండే విటమిన్ కె రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
* మన శరీరంలోని కండరాల బలం పెంచడానికి మొలకెత్తిన పెసలలో ఉండే విటమిన్ కె ఉపయోగపడుతుంది.
* మొలకెత్తిన పెసలలో ఉండే ఆస్టియోకాల్సిన్ అనేది ఆరోగ్యకరమైన ఎముకల కణజాలాన్ని ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది.
* మొలకెత్తిన పెసలు తినడం వలన అవి రక్తనాళాలలో ఏమైనా అడ్డంకులు ఉంటే వాటిని తొలగించి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది.
* గుండె సక్రమంగా పనిచేసేలా చేస్తుంది.
* మొలకెత్తిన పెసలు తినడం వలన మన శరీరంలో జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది.
* మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
* మొలకెత్తిన పెసలు మన శరీరంలోని రక్తంలో చక్కర స్థాయిలు స్థిరంగా ఉండేలా చేస్తుంది.
* మొలకెత్తిన పెసలు తినడం వలన ఎముకలు గట్టిగా ఉండేలా చేస్తుంది.
* కీళ్ళకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నా అవి కూడా తగ్గుతాయి.

కాబట్టి మొలకెత్తిన పెసలు తింటే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజూ మొలకెత్తిన పెసలు తినడం అలవాటు చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి.

 

Also Read : Mint Leaves : పుదీనా తినండి.. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

Exit mobile version