Site icon HashtagU Telugu

Custard Apple: సీతాఫలం ప్రయోజనాలు

Custard Apple

Custard Apple

Custard Apple: సీతాఫలం పండులో శరీరానికి అవసరమైన వివిధ రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా విటమిన్ బి, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మన అదృష్టం కొద్దీ ఈ చెట్లు ప్రతి చోటా ఉంటాయి. మన ఇంటి పెరట్లో కూడా ఈ చెట్టును పెంచుకోవచ్చు, అందుకే గ్రామీణ ప్రాంతాల్లో దీనిని సీతా జామ అని కూడా అంటారు. ఇంట్లో పండించుకోవడం ద్వారా ఖర్చు తక్కువ కావడంతో అన్ని వర్గాల ప్రజలు తినేందుకు అనువైంది.

ఈ పండులో విటమిన్ సి, విటమిన్ బి6, కాల్షియం, ఐరన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీర్ఘకాలిక అల్సర్ వ్యాధితో బాధపడేవారు ఈ పండును తింటే త్వరగా నయం అవుతుంది. అదేవిధంగా ఎసిడిటీ సమస్య ఉన్నవారు కూడా ఈ పండును తినవచ్చు. మన శరీరంలో జీవక్రియ కార్యకలాపాలను ప్రోత్సహిస్తుంది. మన ఆహారాన్ని శక్తిగా మార్చగల సామర్థ్యం దీనికి ఉంది.

కంటికి, గుండె ఆరోగ్యానికి మంచిది. దీన్ని తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి కూడా బాగా పని చేస్తుంది. పండులో సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల చర్మానికి మృదువుగా ఉంటుంది. చిన్నవయసులోనే కంటి సమస్యలు ఉన్న పిల్లలకు ఈ పండు ఉపయోగకరంగా పని చేస్తుంది. ఇంకా మన రక్తంలో హిమోగ్లోబిన్ మొత్తాన్ని పెంచడంలో సహాయపడుతుంది. రక్తహీనత ఉన్నవారు మరియు గర్భధారణ సమయంలో హిమోగ్లోబిన్ లోపం ఉన్న స్త్రీలు ఈ పండును తినవచ్చు.

Also Read: Mahesh : గుంటూరు కారం ఏం చేసినా ఫ్యాన్స్ కి నచ్చట్లేదు..!