మనం ఆకుకూరలలో పాలకూర, చుక్కకూర, బచ్చలి కూర, పుదీనా ఇలా అన్ని రకాల ఆకుకూరలను తింటూ ఉంటాము. ఆకుకూరలు ఆరోగ్యానికి(Health) చాలా మంచివి. వీటితో పాటు దొరికే మరో ఆకుకూర అయిన చింతచిగురును కూడా తినాలి. దీనిని తినడం వలన మనకు అనేక రకాల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. చింతచిగురుతో పప్పు, పచ్చడి చేసుకొని తినవచ్చు. ఇంకా చింతచిగురును(Chintha Chiguru) డైరెక్ట్ గా కూడా తినవచ్చు. ఇది ఎంతో రుచిగా కూడా ఉంటుంది.
మలేరియా, టైఫాయిడ్ ఇంకా పలు వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు చింతచిగురు రసాన్ని తాగితే ఫీవర్ తొందరగా తగ్గుతుంది. చింతచిగురును తినడం వలన మన శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. దీని వలన వ్యాధులు త్వరగా తగ్గుతాయి. షుగర్ ఉన్నవారు చింతచిగురు తినడం వలన షుగర్ కంట్రోల్లో ఉంటుంది. పచ్చ కామెర్లు వచ్చిన వారు చింతచిగురు తినడం వలన తొందరగా తగ్గుతాయి. ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు చింతచిగురు పేస్ట్ ను గాయాలపై రాస్తే తొందరగా తగ్గుతాయి. చర్మ సమస్యలు ఉన్న వాళ్ళు చింతచిగురు తినడం వలన తగ్గుతాయి. దంత సమస్యలు, దంతాలు, చిగుళ్ల నుండి రక్తం కారినా చింతచిగురు తినడం వలన తగ్గుతాయి. దంతాల నొప్పి ఉంటే తగ్గుతుంది. చింత చిగురు తినడం వల్ల దంతాలు కూడా గట్టిగా తయారవుతాయి.
స్త్రీలల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పులు, అధిక రక్తస్రావం వంటివి తగ్గడానికి కూడా చింతచిగురు ఎంతగానో ఉపయోగపడుతుంది. పాలు ఇచ్చే తల్లులు చింతచిగురు తినడం వలన పాలు బాగా పడతాయి. మన శరీరంలో ఏమైనా నొప్పులు, వాపులు ఉన్నా చింతచిగురు తినడం వలన తగ్గుతాయి. చింతచిగురును ఉపయోగించి పప్పు, పచ్చడి మాత్రమే కాకుండా నాన్ వెజ్ తో కూడా కలిపి వండుకోవచ్చు. చికెన్, మటన్, రొయ్యలు వంటి వాటితో కలిపి చింతచిగురు ను వండుకోవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీని వలన మనం చింతచిగురును ఎంతో రుచికరంగా వండుకొని తినవచ్చు, ఇంకా ఆరోగ్యాన్ని పొందవచ్చు.
Also Read : Ice Apples: వేసవిలో తాటి ముంజలు.. ఆరోగ్య ప్రయోజనాలు