Chapathi : ప్రతిరోజూ చపాతి ఎందుకు తినాలి ? దాని వల్ల ఏం జరుగుతుంది ?

అన్నం బదులుగా చపాతీ తింటే పొట్ట తేలికగా ఉండటంతో పాటు.. రెండు చపాతీలు తినగానే కడుపు నిండిన భావన కలిగి తక్కువ ఆహారం తింటారు. ఫలితంగా బరువు కంట్రోల్ లో..

  • Written By:
  • Updated On - October 25, 2023 / 09:31 PM IST

Chapathi : చపాతి.. నార్త్ ఇండియన్స్ తో పాటు.. సౌత్ ఇండియన్స్ కూడా రోజూ ఆహారంలో భాగంగా తినే వంటకం. దీనిని డైట్ లో భాగంగా తీసుకుంటే.. బరువు కంట్రోల్ ఉంటుంది. అలాగే చపాతీ లేదా పుల్కాలు తినడం ద్వారా బరువు తగ్గొచ్చు. ఇది అందరికే తెలిసిన విషయమే. చపాతీ తినడం వల్ల బరువు తగ్గడం మాత్రమే కాదు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని డైటీషియన్స్ చెబుతున్నారు. ప్రతిరోజూ రెండు చపాతీలు ఆహారంలో భాగంగా తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయట.

చపాతీని తయారు చేసేందుకు ఉపయోగించే గోధుమపిండిలో విటమిన్ బి, ఈ వంటివాటితో పాటు కాపర్, జింక్, అయోడిన్, మాంగనీస్, పొటాషియం, క్యాల్షియం వంటి ఖనిజ లవణాలుంటాయి. చపాతీలో ఉండే డైటరీ ఫైబర్ శరీరానికి శక్తిని అందించి రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.

అన్నం బదులుగా చపాతీ తింటే పొట్ట తేలికగా ఉండటంతో పాటు.. రెండు చపాతీలు తినగానే కడుపు నిండిన భావన కలిగి తక్కువ ఆహారం తింటారు. ఫలితంగా బరువు కంట్రోల్ లో ఉంటుంది. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గుతారు. పోషకాహార లోపం తగ్గుతుంది. రోగనిరోధక శక్తి కూడా మెరుగవుతుంది.

చపాతీలో ఉండే పీచు పదార్థం వల్ల జీర్ణక్రియ పనితీరు పెరిగి.. మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

చపాతీతో పాటు పప్పు, ఆలూ కర్రీ మాత్రమే కాకుండా అన్నిరకాల కూరగాయలు తినడం వల్ల అన్ని పోషకాలు అందుతాయి.

జ్వరం ఉన్నపుడు చపాతీ తినకూడదు అంటారు కానీ.. చపాతీ తింటే శరీర ఉష్ణోగ్రతలు కంట్రోల్ అవుతాయి. కానీ.. బయట చేసే చపాతీ పిండిలో మైదా కలుస్తుంది కనుక.. ముడి గోధుమలను ఎండబెట్టి పిండి పట్టించుకుని ఇంట్లోనే తయారు చేసుకుని తింటే.. వాటిలో ఉండే అన్ని పోషకాలు శరీరానికి అందుతాయి.

Also Read : Indigestion – Cancer : అజీర్తి సమస్య వేధిస్తోందా ? పారాహుషార్ !