Site icon HashtagU Telugu

Weight Loss Diet : ఈ డైట్ ప్లాన్ తో నెలరోజుల్లోనే బరువు తగ్గండి

Follow these Weight Loss Diet for one month

Follow these Weight Loss Diet for one month

ఈ రోజుల్లో నూటికి 80 శాతం మందిని అధికంగా వేధిస్తోన్న సమస్య ఊబకాయం(Obesity). బరువు ఎలా పెరగాలి? అనేది కొందరి సమస్య అయితే పెరిగిన బరువు ఎలా తగ్గాలన్నది చాలా మంది సమస్య. బరువు(Weight) తగ్గేందుకు డైటింగ్(Dieting) చేయాలనుకుంటారు కానీ ఇష్టమైన ఆహారం ఎదురుగా కనిపిస్తే తమను తాము నియంత్రించుకోలేరు. అధిక బరువుకు ప్రధాన సమస్య ఇదే. అందుకే ఆకలి వేసినపుడే ఆహారాన్ని మితంగా తీసుకోవడం ముందు అలవాటు చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్, న్యూడిల్స్, పానిపూరి, పిజ్జాలు, బర్గర్లు, కేక్ లు, ఇతర ఆయిల్ ఫుడ్స్ తినడం మానుకోవాలి. ఇలాంటి వాటన్నింటికీ కొన్నాళ్లు దూరంగా ఉంటే తప్ప బరువు తగ్గడం సాధ్యంకాని పని.

1.ప్రతిరోజూ ఉదయం పరగడుపున గోరువెచ్చటి నీటిలో తేనె, నిమ్మరసం కలిపిన నీరు తాగాలి. దీనివల్ల బరువు తగ్గరు కానీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

2.అల్పాహారంగా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, మొలకెత్తిన విత్తనాలను తీసుకోవాలి. రెండు ఎండిన ఖర్జూరాలను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల శరీరంలో కొవ్వుతో పాటు పేరుకున్న నీరు యూరిన్ ద్వారా బయటికి వెళ్లిపోతుంది.

3.అల్పాహారం పూర్తయ్యాక ఉదయం 11 గంటల సమయంలో ఆకలిగా ఉంటే బొప్పాయి, పుచ్చకాయ, కమల, దానిమ్మ వంటి పండ్లను తినొచ్చు.

4.బరువు తగ్గడంలో దాల్చిన చెక్క పొడి కూడా సహాయపడుతుంది. ఒక కప్పు గోరువెచ్చని నీటిలో చిటికెడు దాల్చిన చెక్కపొడి, ఒక స్పూన్ తేనె కలిపి తాగడం వల్ల మెటబాలిజం పెరిగి కొవ్వు కరిగిపోతుంది.

5.మధ్యాహ్నం తినే ఆహారంలో ఒక కప్పు బ్రౌన్ రైస్, రెండు గోధుమ పుల్కాలను రెండు రకాల కూరలతో తినాలి. వీటిలో ఆకుకూరలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.

6.రాత్రి పూట 9 గంటలకు ఆహారం తినే అలవాటును మానుకోవాలి. వీలైనంత వరకూ రాత్రి 7 -8 గంటల మధ్యలో తినేయాలి. డిన్నర్ లో దాదాపు ఫ్రూట్స్ నే ఎక్కువగా తీసుకోవడం మంచిది. లేదంటే రెండు జొన్నరొట్టెలు ఎక్కువగా కూరతో కలిపి తినాలి.

7.పుల్కాలు, జొన్నరొట్టెల వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది కాబట్టి రోజుకి సరిపడా పలుచటి మజ్జిగ చేసుకుని ఉప్పు లేకుండా ప్రతిగంటకోసారి తాగుతుండాలి. మజ్జిగ వల్ల కూడా పేరుకున్న నీరు బయటికి పోవడంతో శరీరం తేలికగా ఉంటుంది.

8.వీటన్నింటికంటే ముందు వ్యాయామం చేయాలి. మీరు ఇప్పుడిప్పుడే డైట్ చేస్తున్నట్లయితే.. వాకింగ్, సైక్లింగ్ తో మొదలుపెట్టి నిదానంగా స్కిప్పింగ్, జంపింగ్ వంటివి చేస్తుండాలి.

9.లిక్విడ్ డైట్ తో 15 రోజుల్లో పూర్తిగా 10-15 కేజీల బరువు తగ్గొచ్చు. ఉదయం 8 గంటలకు వెజిటబుల్ జ్యూస్, 11 గంటలకు బత్తాయి జ్యూస్, మధ్యాహ్నం 2 గంటలకు మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్స్, సాయంత్రం 5 గంటలకు చెరకురసం, రాత్రి 7 గంటలకు దానిమ్మ రసం తాగాలి.

10.ఇలా 15 రోజులపాటు లిక్విడ్ డైట్ తీసుకుంటే.. అధిక బరువును ఈజీగా తగ్గొచ్చు. ఈ క్రమంలో నీరసంగా అనిపిస్తే.. మధ్యలో నిమ్మరసం తీసుకోవచ్చు. డైట్ చేస్తున్న సమయంలో కాఫీలు, టీ లకు ప్రాధాన్యమివ్వకూడదు. వీలైనంత వరకూ చక్కెర లేని పదార్థాలు మాత్రమే తీసుకోవాలి.

 

Also Read :  Face Glowing Face Packs : అందమైన ముఖం కోసం.. నేచురల్ ఫేస్ ప్యాక్స్