Tips To Avoid Dry Skin: చలికాలం చర్మం పొడిబారకుండా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించాల్సిందే..?

చలికాలం మొదలయింది అంతే చాలు చర్మం పొడిబారడం (Tips To Avoid Dry Skin) మొదలవుతుంది.

Published By: HashtagU Telugu Desk
Tips To Avoid Dry Skin

Healthy Skin

Tips To Avoid Dry Skin: చలికాలం మొదలయింది అంతే చాలు చర్మం పొడిబారడం (Tips To Avoid Dry Skin) మొదలవుతుంది. చాలామందిని ఈ సమస్య వేధిస్తూ ఉంటుంది. చలికాలంలో చల్లని గాలుల కారణంగా ఒంట్లో తేమ తగ్గిపోవడం వల్ల చర్మం దురదగా అనిపించడం పగిలిపోవడం లాంటి సమస్యలు మొదలవుతూ ఉంటాయి. చర్మం పగిలిపోవడం మాత్రమే కాకుండా ఎండకు వెళ్లినప్పుడు కొంచెం మంటగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇక పెదవులు చీలి రక్తం కూడా వస్తూ ఉంటుంది. అంతేకాకుండా చలికాలంలో వేడి నీటితో స్నానం చేయడం, గాఢత ఎక్కువ ఉన్న సబ్బులను వాడటం వల్ల కూడా చర్మం పొడిబారుతుంది. ఇక చర్మం పొడిబారడంతో చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్స్,కొబ్బరి నూనె, వ్యాసిలిన్ ఇలాంటివన్నీ పట్టిస్తూ ఉంటారు.

మార్కెట్లో దొరికే వస్తువులు కాకుండా పొడి చర్మం సమస్యలను నివారించడానికి కొన్ని ఆయుర్వేద చిట్కాలను ఉపయోగించడం వల్ల ఆ సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు. మరి ఆ ఆయుర్వేద చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చలికాలంలో మీ ఆహారంలో నెయి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె చేర్చుకోవాలి. ఎందుకంటె ఇవి చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్‌గా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. అల్లం, దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలు వేసిన హెర్బల్‌ టీలు తీసుకోవడం వల్ల పొడి చర్మం సమస్యను తగ్గించుకోవచ్చు. ఇవి మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతో పాటు వేడిని అందిస్తాయి. అలాగే చలికాలంలో స్నానం చేసే ముందు నువ్వులు బాదం కొబ్బరి వంటి నూనెలతో మీ బాడీని మసాజ్ చేసుకోవడం వల్ల రవి చర్మాని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి.

Also Read: Better Sleep At Night: రాత్రుళ్లు నిద్ర పట్టట్లేదా..? అయితే నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టండిలా..!

అలాగే మీ చర్మ సహజ నూనెలు తొలగించే కెమికల్ కఠినమైన సబ్బులను ఉపయోగించకపోవడం మంచిది. అదేవిధంగా మార్కెట్లో దొరికే కెమికల్‌ లోషన్లు చర్మానికి హాని చేస్తాయి. మీ చర్మానికి తేమను అందించడానికి ఆయుర్వేద నూనెలు, హెర్బల్‌ క్రీమ్‌లు వాడండి. బ్రహ్మి, కొబ్బరి, బాదం వంటి నూనెలు మీ చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుతాయి. చలికాలంలో చర్మాన్ని సమతుల్యంగా ఉంచుకోవడానికి మీ శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ చర్మాన్ని చలి, చల్లని గాలుల నుంచి రక్షించుకోవడానికి స్వెట్టర్లు, తలకు స్కార్ఫ్‌, క్యాప్‌లు వంటివి ధరించడం చాలా మంచిది.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే వాత దోషాన్ని సమతుల్యం చేయడానికి మీ దిన చర్యలో యోగా, మెడిటేషన్‌ చేయాలి. ఇవి ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తాయి. కాగా ఒత్తిడి, ఆందోళన చర్మం పొడిబారేలా చేస్తాయి. చాలామంది చలికాలంలో నీరు అంతగా తాగరు. కానీ మీ చర్మాన్ని తేమగా ఉంచుకోవడానికి తగినంత నీరు తాగడం చాలా అవసరం. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి. మీరు తాగే నీళ్లలో అల్లం, దాల్చిన చెక్క, యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలు చేర్చుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ఇది మీ చర్మానికి మేలు చేయడమే కాకుండా, జీర్ణక్రియకు మేలు చేస్తాయి.

  Last Updated: 21 Nov 2023, 10:04 AM IST