Tips for Reduce Cold : జలుబు తగ్గడానికి ఈ వంటింటి చిట్కాలు పాటించండి..

ఎండాకాలం వానాకాలం అని కాకుండా వాతావరణం మారినప్పుడు కూడా జలుబు తొందరగా వస్తుంది. జలుబు తగ్గడానికి వంటింటి చిట్కాలు..

  • Written By:
  • Publish Date - August 28, 2023 / 11:00 PM IST

జలుబు(Cold) అనేది ఈ రోజుల్లో పిల్లలకు, పెద్దలకు వాతావరణంలో కలిగే మార్పుల వలన తొందరగా వస్తుంది. అందుకని ప్రతి సారి మందులు వేసుకోకుండా కొన్ని మన ఇంటిలో వాటిని ఉపయోగించి జలుబును తగ్గించవచ్చు. జలుబు వస్తే దానితో పాటు జ్వరం(Fever), దగ్గు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎండాకాలం వానాకాలం అని కాకుండా వాతావరణం మారినప్పుడు కూడా జలుబు తొందరగా వస్తుంది.

జలుబు తగ్గడానికి వంటింటి చిట్కాలు(Kitchen Tips)..

జీలకర్రను వేయించి పొడి చేసుకోవాలి. దానిని ఒక స్పూన్ తీసుకొని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో లేదా పాలల్లో వేసుకొని రాత్రి పడుకునే ముందు తాగాలి. దీని వలన జలుబు తగ్గుతుంది.

అర స్పూన్ వాము, ఒక స్పూన్ పటికబెల్లం కలిపి దంచాలి దానిని తినాలి. దీనిని తిన్న వెంటనే గోరువెచ్చని నీటిని తాగాలి. ఇలా రోజూ ఉదయం, సాయంత్రం సమయంలో చేయాలి. ఇలా చేయడం వలన జలుబు తగ్గుతుంది.

ఒక చిన్న మూకుడులో కొద్దిగా వాము వేసి వేయించుకోవాలి. దానిని ఒక పలుచటి కాటన్ క్లోత్ లో పెట్టి ముఖం పైన కాపడం పట్టాలి. అప్పుడు శ్లేష్మం కరిగి జలుబు తగ్గుతుంది.

మిరియాల పొడిని కొద్దిగా బెల్లం కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. వాటిని ఉదయం, రాత్రి పూట గోరువెచ్చని నీటితో వేసుకోవాలి. ఇలా చేస్తే జలుబు తగ్గుతుంది.

లవంగాలు లేదా మిరియాలను నీటిలో వేసి మరిగించాలి. దీనిలో కొద్దిగా బెల్లం కూడా వేయాలి. ఇలా చేసిన దానిని రోజుకు రెండు సార్లు కొద్ది కొద్దిగా తాగాలి. అప్పుడు జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది.

గులాబీ పువ్వుల రేకులను నువ్వుల నూనెలో వేసి మరిగించాలి. తరువాత ఆ నూనెను వడగట్టాలి. ఈ నూనె రెండు చుక్కల చొప్పున ముక్కు రంధ్రాలలో వేసుకోవాలి. ఇలా చేయడం వలన కూడా జలుబు తగ్గుతుంది.

ఇక అందరికి తెలిచిన చిట్కా మిరియాల పాలు. రాత్రి పడుకునే ముందు పాలల్లో కొంత మిర్యాల పొడి, పసుపు, బెల్లం వేసి బాగా మరిగిన తర్వాత తాగి పడుకుంటే త్వరగా ఉపశమనం కలుగుతుంది.

అలాగే వేడినీళ్లలో పసుపు, అమృతాంజనం వేసి ఆవిరి పట్టినా జలుబు తగ్గుతుంది. జలుబు వచ్చినప్పుడు ఇలా మన ఇంటిలోని చిట్కాలు వాడి జలుబును తగ్గించుకోవచ్చు.

 

Also Read : Food for Energy : నీరసంగా అనిపించి ఏ పనిని చేయలేకపోతున్నారా.. అయితే ఈ ఆహార పదార్థాలను తీసుకోండి..