భోజనం తర్వాత నిద్ర వస్తోందా? అది కేవలం బద్ధకం కాకపోవచ్చు!

వైద్యుల అభిప్రాయం ప్రకారం.. భోజనం చేసిన ప్రతిసారీ తీవ్రమైన నిద్ర, అలసట వస్తుంటే అది 'ఇన్సులిన్ రెసిస్టెన్స్' ప్రారంభ లక్షణం కావచ్చు. ఈ స్థితిలో శరీరం చక్కెరను శక్తిగా మార్చడంలో విఫలమవుతుంది.

Published By: HashtagU Telugu Desk
Sleepy

Sleepy

Sleepy: మధ్యాహ్నం సమయం కాగానే చాలా మందికి కళ్లు బరువుగా అనిపిస్తాయి. ముఖ్యంగా లంచ్ తర్వాత ఆఫీసులో ఉన్నా.. ఇంట్లో ఉన్నా నిద్ర ముంచుకురావడం సర్వసాధారణం. దీనిని మనం బద్ధకం అని లేదా ఎక్కువగా తినడం వల్ల అని సరిపెట్టుకుంటాం. కానీ ప్రతిరోజూ ఇలాగే జరుగుతుంటే దానిని తేలికగా తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది శరీరంలో అంతర్గతంగా ఉన్న ఏదో సమస్యకు సంకేతం కావచ్చు.

భోజనం చేసిన తర్వాత శరీరంలో ఏం జరుగుతుంది?

మనం ఆహారం తిన్న తర్వాత శరీరం మొత్తం దృష్టి జీర్ణక్రియ మీదకు మళ్లుతుంది. ఈ సమయంలో జీర్ణ అవయవాలకు రక్త ప్రసరణ పెరుగుతుంది. మెదడుకు రక్త ప్రసరణ కొద్దిగా తగ్గుతుంది. దీనివల్ల బద్ధకం, నిద్ర అనిపించవచ్చు. దీనిని మెడికల్ భాషలో ‘పోస్ట్ లంచ్ డిప్’ అని పిలుస్తారు. ఇది సహజమైన ప్రక్రియే అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఇది మరింత తీవ్రమవుతుంది.

Also Read: 2026లో టాటా మోటార్స్ నుంచి రాబోతున్న సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటే సుస్తీ తప్పదు!

మీ భోజనంలో అన్నం, బంగాళదుంపలు, వైట్ బ్రెడ్ లేదా స్వీట్లు ఎక్కువగా ఉంటే రక్తంలో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరిగి, ఆ తర్వాత అంతే వేగంగా పడిపోతాయి. ఈ హెచ్చుతగ్గుల వల్ల శరీరం అలసిపోయినట్లు అనిపించి నిద్ర వస్తుంది. అలాగే భోజనం తర్వాత శరీరంలో కొన్ని హార్మోన్లు విడుదలయ్యి శరీరాన్ని ‘రిలాక్స్ మోడ్’లోకి తీసుకెళ్తాయి. రాత్రి నిద్ర సరిగ్గా లేకపోయినా ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.

ఇది ఏ వ్యాధికి సంకేతం కావచ్చు?

వైద్యుల అభిప్రాయం ప్రకారం.. భోజనం చేసిన ప్రతిసారీ తీవ్రమైన నిద్ర, అలసట వస్తుంటే అది ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ ప్రారంభ లక్షణం కావచ్చు. ఈ స్థితిలో శరీరం చక్కెరను శక్తిగా మార్చడంలో విఫలమవుతుంది. రక్తంలో పెరిగిన షుగర్‌ను నియంత్రించడానికి శరీరం ఎక్కువ ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది. ఇది అలసటకు కారణమవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో డయాబెటిస్ (మధుమేహం), గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్ ముప్పు కూడా పెరగవచ్చు. దీనిని ‘సైలెంట్ మెటబాలిక్ ప్రాబ్లం’ అని కూడా అంటారు.

దీని నుండి ఎలా బయటపడాలి?

సమతుల్య ఆహారం: భోజనంలో ఫైబర్ (పీచు పదార్థం), ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. తీపి పదార్థాలు, రిఫైన్డ్ కార్బ్స్ తగ్గించాలి.

చిన్న నడక: భోజనం చేసిన వెంటనే పడుకోకుండా 10 నుండి 15 నిమిషాల పాటు నడవడం చాలా మంచిది.

వ్యాయామం: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువును నియంత్రించుకోవడం, తగినంత నిద్రపోవడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

  Last Updated: 24 Dec 2025, 05:17 PM IST