మన వంటింట్లో దొరికే కూరగాయల్లో ఆలుగడ్డ కూడా ఒకటి. దీనినే బంగాళదుంప,ఉర్లగడ్డ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ బంగాళదుంప ఎన్నో రకాల కూరల్లో ఉపయోగించడంతో పాటు ప్రత్యేకించి బంగాళదుంపతో కొన్ని రకాల కూరలు కూడా తయారు చేస్తూ ఉంటారు. అయితే మనలో చాలామంది ఈ బంగాళదుంప తినడానికి అంతగా ఇష్టపడరు. కానీ బంగాళాదుంపతో చేసే జంక్ ఫుడ్స్ మాత్రం తెగ ఇష్టపడి తింటూ ఉంటారు. కాగా ఈ బంగాళదుంపలో విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ సి, బి6, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, నియాసిన్, ఫోలేట్ వంటి పోషకాలు లభిస్తాయి.
విటమిన్ బి6 మెదడు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. ఆలుగడ్డల్లో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్ జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే చాలామంది డయాబెటిస్ ఉన్నవారు బంగాళదుంప తినడానికి కాస్త ఆలోచిస్తూ ఉంటారు.. మరి ఈ షుగర్ ఉన్నవారు బంగాళదుంప తినకూడదా? తింటే ఏం జరుగుతుంది? ఈ విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బంగాళాదుంపలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు ఆలుగడ్డ తినకపోవడమే మంచిదట. ఎందుకంటే బంగాళదుంపలో ఉండే కార్పోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుతాయని చెబుతున్నారు వైద్యులు. అందుకే షుగర్ ఉన్నవారు తినకపోవడమే మంచిదట. ఆలుగడ్డలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్‌తో పోరాడి కణాల నష్టాన్ని తగ్గిస్తాయి.
పొటాషియం ఎక్కువగా ఉండే ఆలు గడ్డలను తింటే రక్తపోటు అదుపులో ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అలాగే
ఊబకాయం, ఎసిడిటీ, మధుమేహం, కీళ్లనొప్పులు లాంటి సమస్యలతో బాధపడేవారు ఆలుగడ్డలను తక్కువ మోతాదులో తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ ఫ్రెంచ్‌ఫ్రైస్, చిప్స్ రూపంలో కాకుండా పొట్టుతో పాటు ఉడికించిన ఆలూ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట. ఎప్పుడూ రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నవారు ఆలుగడ్డలను తినకపోవడమే మంచిదని సూచిస్తున్నారు వైద్యులు. నిజానికి ఆలుగడ్డలో పొటాషియం, బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా బంగాళదుంప పొట్టులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఉడికించిన బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఆలూ మెంతికూర, బెండకాయ వంటి అధిక ఫైబర్ కూరగాయలతో వండటం వల్ల డయాబెటిస్ రోగులు తినొచ్చని చెబుతున్నారు.
Note: ఈ సమాచారం కేవలం ఇంటర్నెట్ నుంచి మాత్రమే సేకరించబడింది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్నా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.