లీచీ పండ్లు.. ఈ పండ్లను చాలామంది చూసి, వాటి పేర్లు విని ఉంటారు కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఈ పండ్లను తిని ఉంటారు. లీచీ పండ్లు సీజనల్ ఫ్రూట్స్ అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. లిచీ పండు భారతదేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలలో విరివిగా లభించే సమ్మర్ ఫ్రూట్. తియ్యగా, జ్యూసీగా ఉండే లిచీ పండ్లను చూస్తేనే తినకుండా ఉండలేం. దీనితో ఐస్‌క్రీమ్‌లు, మాక్‌టాయిల్, జ్యూస్‌లు కూడా తయారు చేస్తాయి. లిచీలో పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, డి, ఫైబర్, మెగ్నీషియం, రైబోఫ్లేవిన్, కాపర్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
లిచీ పండ్లు మన డైట్‌లో చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. లీచీ పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది, సోడియం తక్కువగా ఉంటుంది. ఇది హైపర్ టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచడానికి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ కారణంగా హైపర్‌టెన్షన్ ముప్పు పెరుగుతుంది. అలాగే లిచీలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది తరచుగా తింటే అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్ లకు దూరంగా ఉండవచ్చు. లిచీ పండులో ఉండే ఫ్లేవనాయిడ్స్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.
ఇవి ఫ్లూ, ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఈ సీజన్‌లో చాలామంది కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రక్, మలబద్ధకం వంటి జీర్ణవ్యవస్థ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. లిచీలో పొటాషియం మెండుగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. లిచీ మీ డైట్‌లో చేర్చుకుంటే జీర్ణవ్యవస్థ సమస్యలు దూరం అవుతాయి. అంతేకాకుండా ఈ లీచీ పండ్లు ఎముకలకు సంబంధించిన సమస్యలను నయం చేయడంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి.