Site icon HashtagU Telugu

Daily Walking : రోజూ వాకింగ్ చేస్తున్నారా ? ఎన్ని అడుగులు నడవాలంటే..

Walking Benefits

Walking Benefits

Daily Walking : వాకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిదే. చాలా వరకూ అనారోగ్య సమస్యలను వాకింగ్ ద్వారా తగ్గించుకోవచ్చు. అందుకే చాలా మంది వాకింగ్ చేస్తుంటారు. రెగ్యులర్ గా వాకింగ్ చేస్తే.. షుగర్, కొలెస్ట్రాల్, బీపీ అన్నీ కంట్రోల్ అవుతాయి. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. అధిక బరువు కూడా తగ్గుతారు. బరువు తగ్గేందుకు వాకింగ్ చాలా తేలికైన వ్యాయామం. ప్రతిరోజూ వాకింగ్ చేస్తే ఇంకా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

రోజూ వాకింగ్ చేస్తారు. కానీ.. ఎన్ని నిమిషాల పాటు.. ఎన్ని అడుగుల దూరం వరకూ వాకింగ్ చేయాలన్న సందేహం అందరికీ ఉంటుంది. అందుకే సైంటిస్టులు ఒక సులభమైన మార్గం చెబుతున్నారు. ప్రతిరోజూ 7000 అడుగులు నడిస్తే చాలు.. బాగా వాకింగ్ చేసినట్లు అవుతుంది. వివిధ రకాల వ్యాధుల కారణంగా చనిపోయే అవకాశాలు కూడా 70 శాతం తగ్గుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. అందుకే రోజుకు కనీసం 7000 అడుగులు అంటే.. కనీసం 30-40 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి.

7000 అడుగులు నడిచినట్లు ఎలా తెలుస్తుందనేదే మీ అనుమానం అయితే.. అందుకు మీ స్మార్ట్ ఫోన్ ఉందిగా. మీ స్మార్ట్ ఫోన్ లో పెడోమీటర్ యాప్ ను ఇన్ స్టాల్ చేసి.. వాకింగ్ చేసేటపుడు దానిని ఓపెన్ చేసి ఉంచాలి. మొబైల్ ను పాకెట్ లో లేదా చేతితో పట్టుకుని వాకింగ్ చేస్తే.. మీరు ఎన్ని అడుగులు వాకింగ్ చేశారో అది లెక్కిస్తుంది. స్మార్ట్ వాచ్, స్మార్ట్ బ్యాండ్ ల ద్వారా కూడా వాకింగ్ అడుగులను లెక్కించుకోవచ్చు. ఇలా రోజూ వాకింగ్ చేస్తూ.. ఆ డేటాను ఫోన్ లో స్టోర్ చేసుకుంటే.. రోజుకు ఎన్ని అడుగులు వాకింగ్ చేస్తున్నారో ఈజీగా తెలుస్తుంది. ఇలా ప్రతిరోజూ వాకింగ్ చేస్తే ఆరోగ్యంతో పాటు.. వాకింగ్ వల్ల వచ్చే చెమట ద్వారా చర్మంలోపలికి పేరుకున్న మృతకణాలు కూడా తొలగిపోతాయి.

Also Read : Cholesterol: మంచి కొలెస్ట్రాల్ అంటే ఏంటి..? ఇది మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది..?