Site icon HashtagU Telugu

Snacks : సాయంత్రం పూట స్నాక్స్ గా వీటిని తింటే ఎన్నో ప్రయోజనాలు

Evening Snacks

Evening Snacks

సాయంత్రం అయ్యేసరికి చాలా మందికి ఏదైనా తినాలని (Snacks ) అనిపించడం సహజం. అయితే ఆకలికి ఏదిపడితే అది తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందించుకోవచ్చు. ముఖ్యంగా తక్కువ కొవ్వు, ఎక్కువ ప్రోటీన్, ఫైబర్ కలిగిన వాటిని తినడం మంచిది. వీటివల్ల శరీరానికి శక్తి అందడంతో పాటు, జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

Varun Chakaravarthy: న‌న్ను భార‌త్ రావొద్ద‌ని బెదిరించారు.. డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయా: వరుణ్ చక్రవర్తి

పెనంపై వేయించిన శనగలు తింటే శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఫైబర్, ఇతర పోషకాలు అందుతాయి. అలాగే ఉడకపెట్టిన మొక్కజొన్న తింటే ఫైబర్ అధికంగా లభించడంతో పాటు, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బాదం, నల్లద్రాక్ష, పిస్తా, వాల్నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు శరీరానికి అందుతాయి. ఈ విధంగా సరైన ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలను సమకూర్చుకోవచ్చు.

CM Revanth : గుడ్డలూడదీసి కొడతాం.. ఫేక్ జర్నలిస్టులకు సీఎం వార్నింగ్

దీనికి విరుద్ధంగా నూనెలో వేయించిన బజ్జీలు, పకోడీ, పునుగులు వంటి ఆహార పదార్థాలను తరచుగా తినడం ఆరోగ్యానికి హానికరం. ఇవి అధిక కొవ్వు మరియు ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండేలా తయారవుతాయి, తద్వారా కొలెస్ట్రాల్ పెరిగి గుండె సంబంధిత సమస్యలు రావడానికి అవకాశముంటుంది. కాబట్టి సాయంత్రం స్నాక్స్‌ను జాగ్రత్తగా ఎంచుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.