గుడ్డు(Egg)లో అన్ని రకాల విటమిన్లు, ప్రోటీన్లు ఉన్నాయి. అందుకని గుడ్డును అందరూ తమ ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. గుడ్డుని కూర, పులుసు, ఆమ్లెట్, ఉడికించి.. ఇలా రకరకాలుగా తింటారు. అయితే ఉడికించిన గుడ్డు కంటే ఆమ్లెట్(Omelet) ఎంతో రుచిగా ఉంటుంది. కానీ ఉడికించిన గుడ్డు(Boiled Egg) తినడం మన ఆరోగ్యానికి మంచిది. ఉదయం టిఫిన్ తినే టైమ్ లో మనం ఉడికించిన గుడ్డును తింటే ఆ రోజంతా ఎంతో హుషారుగా ఉంటాము. అలసట అనేది రాకుండా ఉంటుంది.
గుడ్డులో విటమిన్ డి, విటమిన్ బి 12, రిబోఫ్లేమిన్ లు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి మనకు శక్తిని అందజేస్తాయి. గుడ్డులో ఉండే యాంటి ఆక్సిడెంట్లు మన కళ్ళకు రక్షణను కలిగిస్తాయి. గుడ్డు తినడం వలన అది మన శరీరంలో మంచి కొవ్వులు పెరగడానికి దోహదం చేస్తాయి. ఉడికించిన గుడ్లలో ఉండే కొలిన్ మన మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉడికించిన గుడ్డులో 78 క్యాలరీలు ఉంటాయి.
ఆమ్లెట్ వేసుకునేటప్పుడు దానిలో కూరగాయ ముక్కలు వేసుకుంటే అవి పోషకాలను అందిస్తాయి. ఆమ్లెట్ లో కొవ్వు, క్యాలరీలు కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఆమ్లెట్లో మన ఆరోగ్యానికి ఉపయోగకరమైనవే ఉంటాయి. అయితే ఆమ్లెట్ కంటే ఉడికించిన గుడ్డు ఎంతో మంచిది. ఎందుకంటే ఉడికించిన గుడ్డుకు ఇతర పదార్థాలు ఏమి కలుపము కాబట్టి. ఆమ్లెట్ తయారుచేసేటప్పుడు నూనె లేదా వెన్న వాడతారు కాబట్టి దీని కంటే ఉడికించిన గుడ్డు ఎంతో ఆరోగ్యకరం. అందుకే చాలా మంది ఉదయం సమయంలో ఉడికించిన కోడిగుడ్డుని తినడానికి ఇష్టపడతారు.
Also Read : Ginger: బరువు తగ్గాలని చూస్తున్నారా.. అయితే అల్లం సాయం తీసుకోండిలా..!