Onion Juice: గత కొన్నేళ్లుగా చాలా మందికి జుట్టు రాలడం సాధారణ సమస్యగా మారింది. నిరంతరం జుట్టు రాలడం వల్ల చాలా మంది బట్టతల సమస్యను ఎదుర్కొంటున్నారు. మీరు కూడా జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? అయితే వంటగదిలో ఉండే ఉల్లిపాయ రసం (Onion Juice) దీనిని ఎదుర్కోవడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందని రుజువు చేస్తుంది. మేము ఉల్లిపాయ రసం గురించి మాట్లాడుతున్నాము. ఉల్లిపాయ రసం జుట్టుకు దివ్యౌషధంగా పరిగణించబడుతుంది. ఇది జుట్టును పటిష్టం చేయడంలో.. జుట్టు రాలడాన్ని అరికట్టడంలో, కొత్త వెంట్రుకలు పెరగడంలో సహాయపడుతుంది. ఉల్లిపాయ రసం ప్రయోజనాలు..? దానిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం.
ఉల్లిపాయ రసం ప్రయోజనాలు
- ఉల్లిపాయలో సల్ఫర్ ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. కొల్లాజెన్ జుట్టును బలపరుస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
- ఉల్లిపాయ రసం తలలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది జుట్టు మూలాలకు మరింత పోషణను అందిస్తుంది. కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
- ఉల్లిపాయ రసం తలలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది జుట్టు మూలాలకు మరింత పోషణను అందిస్తుంది. కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
- ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును డ్యామేజ్ కాకుండా కాపాడతాయి. వాటిని బలంగా చేస్తాయి.
- ఉల్లిపాయలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి స్కాల్ప్ ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి.
- ఉల్లిపాయ రసం జుట్టును నల్లగా, సహజంగా మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.
- ఉల్లిపాయ రసంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.
Also Read: World Gratitude Day : కృతజ్ఞతలు చెప్పడం ద్వారా కూడా ఈ వ్యాధి నయమవుతుంది
ఎలా ఉపయోగించాలి..?
అన్నింటిలో మొదటిది ఒక ఉల్లిపాయని తురిమి దాని రసాన్ని ఒక గిన్నెలో పిండాలి. దీని తరువాత మీ వేళ్ళతో నేరుగా తలపై రసాన్ని అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. జ్యూస్ స్కాల్ప్ కు సరిగ్గా చేరేలా కాసేపు మృదువుగా మసాజ్ చేయండి. తర్వాత కనీసం అరగంట పాటు అలాగే ఉంచాలి. దీని తర్వాత మీ జుట్టును షాంపూతో కడిగితే ఫలితం ఉంటుంది. ఇలా వారంలో కనీసం రెండు స్లారు చేసిన ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.