Pomegranate – Banana : దానిమ్మను వీటితో కలిపి తింటే సమస్యలే !

దానిమ్మ పండు తింటే హెల్త్‌కు చాలా మంచిది. ప్రత్యేకిించి మన గుండెకు ఇది ఎక్కువ మేలు చేస్తుంది.

  • Written By:
  • Updated On - June 30, 2024 / 09:32 PM IST

Pomegranate – Banana : దానిమ్మ పండు తింటే హెల్త్‌కు చాలా మంచిది. ప్రత్యేకిించి మన గుండెకు ఇది ఎక్కువ మేలు చేస్తుంది. ఆర్థరైటిస్ సమస్యను కూడా తగ్గిస్తుంది. దానిమ్మను విడిగా తిన్నంత వరకు ఓకే. అయితే దాన్ని కొన్ని మెడిసిన్స్, ఫుడ్స్‌తో కలిపి తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈవిధంగా దానిమ్మతో కలిపి తినకూడని పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

  • దానిమ్మ పండ్లలో యాసిడ్ లెవల్స్ తక్కువ. అందుకే వీటిని అరటిపండ్ల వంటి తియ్యటి ఫ్రూట్స్‌తో కలిపి తినకూడదు. ఒకవేళ వీటిని కలిపి తింటే జీర్ణ సమస్యలు వస్తాయి.
  • రక్తం గడ్డకట్టే ప్రాబ్లమ్ ఉన్నవారు ‘బ్లడ్ థిన్నర్’ ఔషధాలు వాడుతుంటారు.  దానిమ్మ పండు అనేది వార్ఫరిన్‌ అనే బ్లడ్ థిన్నర్‌తో సంకర్షణ చెందుతుంది. ఫలితంగా శరీరంలో రక్తం గడ్డకట్టడం మరింత పెరిగిపోతుంది.
  •  అధిక రక్తపోటు చికిత్స కోసం చాలామంది కాల్షియం ఛానల్ బ్లాకర్ ఔషధాలు వాడుతారు. ఇది వాడుతున్న వారు దానిమ్మ రసం తాగితే ప్రేగులలోని ఔషధ జీవక్రియ తగ్గిపోతుంది.
  • శరీరంలోని చెడు(ఎల్‌డీఎల్) కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి కొందరు స్టాటిన్స్ అనే మందులు వాడుతుంటారు. ఇవి తిన్నాక.. దానిమ్మ  తింటే రాబ్డోమియోలిసిస్ సమస్య వస్తుంది. దీనివల్ల కండరాల కణజాలం విచ్ఛిన్నమై కిడ్నీలు దెబ్బతింటాయి.
  • కిడ్నీ, గుండె, హైబీపీ సమస్యలున్న వారు మందులు తీసుకున్న రోజున దానిమ్మను(Pomegranate – Banana) తీసుకోకపోవడమే బెటర్.

Also Read :Real Estate : అమరావతి ప్రభావం.. హైదరాబాద్‌లో భారీగా పడిపోయిన ఇళ్ల విక్రయాలు..?

  • ఎలర్జీ సమస్యలు ఉన్నవారు దానిమ్మ విత్తనాలకు దూరంగా ఉండాలి. ఇలాంటి వారు దానిమ్మ తింటే అలర్జీ సమస్యలు పెరుగుతాయి.
  • ఖాళీ కడుపుతో దానిమ్మ తినకూడదు. దానిమ్మ విత్తనాలు లేదా దానిమ్మ జ్యూస్‌ ఖాళీ కడుపుతో తినడం వల్ల అసిడిటీతో పాటు వివిధ శారీరక సమస్యలు తలెత్తుతాయి.
  • రక్తపోటు తక్కువగా ఉన్నవారు దానిమ్మ తినకూడదు. తక్కువ రక్తపోటు ఉన్నవారు దానిమ్మ తినడం వల్ల రక్త ప్రసరణ మందగించవచ్చు.
  • మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా ఎండు దానిమ్మ తినకూడదు. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి.