Site icon HashtagU Telugu

Sridevi Diet : శ్రీదేవి పాటించిన డైట్ ఎంత ప్రమాదకరమైనదో మీకు తెలుసా? మీరు మాత్రం అలా చేయకండి..

Eating Less Salt Dont Follow Sridevi Diet It Causes Health Issues

Eating Less Salt Dont Follow Sridevi Diet It Causes Health Issues

శ్రీదేవి(Sridevi) అంటేనే అతిలోకసుందరి. ఆవిడ తన అందం మెయింటైన్ చేయడం కొరకు తన డైట్(Diet)లో ఉప్పు(Salt) అనేది చాలా తక్కువగా తీసుకునేవారు అంట. ఈ విషయాన్ని ఆమె భర్త బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్(Boney kapoor) ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. డాక్టర్లు శ్రీదేవి గారికి ఉప్పు తీసుకోకపోవడం వలన ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పినా ఆవిడ తన పద్దతిని మార్చుకోలేదు అని, దానివల్ల కొన్ని సార్లు ఇబ్బంది కూడా పడ్డారని, దానివల్లే ఆకస్మిక మరణానికి గురయ్యారు అని బోనీకపూర్ ఇటీవల తెలిపారు.

మనిషి తన వయస్సు, బాడీ ఇండెక్స్ ఆధారంగా రోజులో మనం తీసుకునే ఆహారంలో మనకు సరిపడ ఉప్పును తప్పనిసరిగా తీసుకోవాలి. ఉప్పు గనుక తక్కువగా తీసుకున్నట్లైతే అది లో బిపికి దారితీస్తుంది. సోడియం మన శరీరంలో ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తుంది. సెల్యులార్ ఫంక్షన్ లను నిర్వహిస్తుంది. అయితే సోడియం తక్కువగా తీసుకుంటే ఎలక్ట్రోలైట్లు బ్యాలన్స్ లో తేడా వచ్చి కళ్ళు తిరిగి కిందపడతారు, స్పృహను కోల్పోతారు.

మన శరీరానికి సరిపడ సోడియం లేకపోతే నీరు చేరి ఉబ్బినట్లుగా అవుతుంటారు ఇంకా కండరాలు, కణాలు కూడా ఉబ్బుతుంటాయి మనలోని రక్తపోటును కూడా మారుస్తాయి. మనం రోజులో తీసుకునే ఆహారంలో 2 .5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకుంటే మన శరీరంలో సోడియం లెవెల్స్ తక్కువగా ఉండి కళ్ళు తిరగడం, అలసట, తలనొప్పి, స్పృహ కోల్పోవడం వంటివి జరుగుతాయి. దీనిని హైపోనాట్రేమియా అంటారు.

ఈ హైపోనాట్రేమియా అనేది మూడు రకాలుగా ఉంటుంది. వాటిలో మొదటిది మందులతో తగ్గిపోతుంది. రెండవది మనకు స్పృహ కోల్పోవడం లేదా మనం కోమాలోకి వెళ్లడం జరుగుతుంది. మూడవది మన మెదడులోని నరాలు చిట్లిపోయి మరణించే ప్రమాదం ఉంది. మధుమేహం, బిపి ఉన్నవారు ఉప్పు తక్కువగా తింటే ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ డాక్టర్లు చెప్పకుండా మనం తినే ఆహారంలో ఉప్పును తగ్గించి తినకూడదు. అలా అని ఎక్కువా తినకూడదు. మన అందరికీ తెలిసిన విషయమే కదా ఏదయినా మనం మితంగా తింటే మన ఆరోగ్యానికి మంచిది.

 

Also Read : Health Tips : ఈ 13 ఆరోగ్య సూత్రాలు పాటిస్తే.. నూరేళ్ల ఆయుష్షు మీ సొంతం