Immunity Food : మన శరీరంలో ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి ఎంత ఎక్కువగా ఉంటే మనం అంత స్ట్రాంగ్ గా ఉంటాము. ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే తొందరగా రోగాల బారిన పడతాము, ఏదైనా దెబ్బలు తగిలినా తొందరగా కోలుకోలేము. ఇమ్యూనిటీ మనం తినే ఆహరం నుంచే వస్తుంది. ఇమ్యూనిటీ మన శరీరంలో పెరగడానికి జింక్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. మన శరీరంలో జింక్ తక్కువగా ఉన్నట్లైతే ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ కి గురవడం జరుగుతుంది. కాబట్టి మనం తినే ఆహారంలో జింక్ ఉండేవిధంగా చూసుకోవాలి.
రోజుకు పురుషులకు 11 మిల్లీ గ్రాముల జింక్ అవసరం. స్త్రీలకు 8 మిల్లీ గ్రాముల జింక్ మరియు పిల్లలకు 5 మిల్లీ గ్రాముల జింక్ అవసరం. జింక్ సరైన మోతాదులో మనం ఆహారంలో భాగంగా తీసుకుంటే మన శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. 30 గ్రాముల గుమ్మడికాయల విత్తనాలలో 2 .2 మిల్లీగ్రాముల జింక్ ఉంటుంది. గుమ్మడికాయ విత్తనాలను ఉదయం పూట మరియు సాయంత్రం స్నాక్స్ సమయంలో తినవచ్చు. ఒక కప్పు ఓట్స్ లో 2 .3 మిల్లీ గ్రాముల జింక్ ఉంటుంది. కాబట్టి ఒక కప్పు ఓట్స్ ని కూడా రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటే జింక్ మన శరీరంలోకి ఎక్కువ మోతాదులో లభిస్తుంది.
శనగలు, పప్పు దినుసులు తినడం వలన కూడా జింక్ అధికంగా లభిస్తుంది. వంద గ్రాముల పప్పు దినుసులలో 1 .3 మిల్లీగ్రాముల జింక్ ఉంటుంది. పప్పు దినుసులలో ఫైబర్, విటమిన్లు, ఎమినో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, డార్క్ చాకోలెట్స్, ఆకు కూరలు, నారింజ, ఆలివ్ ఆయిల్.. ఇలా పలు ఆహార పదార్థాలలో జింక్, కావాల్సిన విటమిన్స్ ఉన్తయి. వీటిని మనం రెగ్యులర్ గా తినడం వలన మన శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. దీని వలన మనం తొందరగా ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉంటాము.
Also Read : Cough : దగ్గు వస్తున్నప్పుడు ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి..
గమనిక: పైన ఇచ్చిన సమాచారాన్ని పాఠకుల అవగాహన కోసం ఇంటర్నెట్ నుంచి తీసుకున్నాం. దీన్ని ‘హ్యాష్ ట్యాగ్ యూ తెలుగు’ ధృవీకరించదు.