Site icon HashtagU Telugu

Liver Health Tips: మీ లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినాలి..!!

Eat These To Keep Your Liver Healthy..!!

Eat These To Keep Your Liver Healthy..!!

Liver Health : మన శరీరంలో కీలక అవయవాలలో లివర్‌ ఒకటి. కాలేయం 500 రకాల జీవక్రియలను నిర్వర్తిస్తుంది. మన బాడీలో అతి పెద్ద అంతర్గత అవయవం లివర్‌. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తంలోని విషపదార్థాలను తొలగిస్తుంది. శక్తిని నిల్వ చేస్తుంది, హార్మోన్లను, ప్రోటీన్‌లను రెగ్యులేట్ చేస్తుంది. ముఖ్యంగా శరీరంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లు, కొవ్వులు, రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా లివర్‌ (Liver) నియంత్రిస్తుంది. కొవ్వును తగ్గించడంలో, కార్బోహైడ్రేట్లను నిల్వ చేయడంలో, ప్రోటీన్లను తయారు చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యమైన హార్మోన్లను, ఎంజైమ్‌లను తయారు చేస్తుంది. లివర్‌ పాడైనా.. తనను తాను రిపేర్‌ చేసుకునే సామర్థ్యం దానికి ఉంది. అలా అని లివర్‌ సమస్యలు రావనుకుంటే పొరపాటే. మన లైఫ్‌స్టైల్‌లో మార్పులు, జంక్ ఫుడ్స్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్‌, సోడా, ఆల్కహాల్‌, ఇతర కార్బోనేటేడ్ డ్రింక్స్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్‌ సమస్యలు ఎక్కువయ్యాయి.

జాగ్రత్తగా కాపాడుకోవాలి..

ఒక అధ్యయనం ప్రకారం, భారతదేశంలో ప్రతి 5 మందిలో ఒకరు లివర్‌ సమస్యతో బాధపడుతున్నారు. ఈ కీలకమైన అవయవాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. దీని కోసం, మీ లైఫ్‌స్టైల్‌లో మార్పులు చేసుకుని, మీరు తీసుకునే ఆహారం, పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కొన్ని కూరగాయలు లివర్‌కు సూపర్‌ ఫుడ్స్‌లా సహాయపడతాయి. ఇవి క్రమం తప్పకుండా మీ డైట్‌లో చేర్చుకుంటే.. ఫ్యాటీ లివర్‌, ఇతర లివర సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు.

బీట్‌ రూట్‌..

నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (NCBI) అధ్యయనం ప్రకారం, బీట్‌రూట్ మన డైట్‌లో తీసుకుంటే లివర్‌ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. బీట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది వ్యర్థాలను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. దీంతో, అవి శరీరం నుంచి త్వరగా బయటకు వెళ్తాయి. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకునేవారు, లివర్‌ సమస్యలు ఉన్నవారు బీట్‌ రూట్‌ జ్యూస్‌ తాగితే మంచిది.

బ్రకోలీ..

ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం,ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం, లివర్‌ సమస్యలతో బాధపడేవారు బ్రకోలీ తీసుకుంటే మంచిది. బ్రకోలీ రోజూ తీసుకుంటే.. లివర్‌ దెబ్బతినే ప్రమాదం తగ్గుతుంది. ఫ్యాటీ లివర్‌ సమస్య ఉన్నవారు బ్రకోలీ కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.

బ్రస్సెల్స్ స్ప్రౌట్స్‌..

బ్రస్సెల్స్ స్ప్రౌట్స్‌, క్రూసిఫరస్ కుటుంబానికి చెందిన వెజిటేబుల్. దీనిలో విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. బ్రస్సెల్స్ స్ప్రౌట్స్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. లివర్‌ ఆరోగ్యానికి మేలు చేస్తే.. చాలా సమ్మేళనాలు బ్రస్సెల్స్‌ స్ప్రౌట్స్‌లో ఉన్నాయి. లివర్‌ సమస్యలకు దూరంగా ఉండాలంటే.. బ్రస్సెల్స్‌ స్పౌట్స్‌ మీ డైట్‌లో చేర్చుకుంటే మంచిది.

ఆకు కూరలు..

ఆకు కూరలు ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చాలా మందికి తెలిసే ఉంటుంది. కాలే, పాలకూర, కొల్లార్డ్ గ్రీన్స్ మీ డైట్‌లో చేర్చుకుంటే లివర్‌ సమస్యలు రావు. ఈ ఆకు కూరల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి, ప్రమాదక ఫ్రీ రాడికల్స్‌ను శరీరం నుంచి తొలగిస్తాయి. ఈ ఆకుకూరలను కచ్చితంగా మీ డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Also Read:  Stomach Health Tips: మీ కడుపు ఆరోగ్యంగా సరిగ్గా లేకుంటే ఈ సంకేతాలు కనిపిస్తాయి.. వాటికి చెక్ ఇలా..